బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు (Elections) తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. 299 స్థానాల కోసం నేడు ప్రారంభమైన పోలింగ్‌లో మున్షీగంజ్, గోపాల్‌గంజ్ వంటి ప్రాంతాల్లో దుండగులు ముడి బాంబులు పేల్చి హింస చెలరేగేలా చేశారు. ఖుల్నా-2లో బీఎన్‌పీ నేతలకు, జమాత్-ఏ-ఇస్లామీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. రాజధాని ఢాకాలో కూడా అల్లర్లు, భాష్పవాయువు వినియోగం జరిగింది. ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు.
Read Also: Russia: భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్
మద్దతుదారులపై దాడులు
ఖుల్నా జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత మొహిబుజ్జమాన్ కోచీ మరణించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఖుల్నాలోని అలియా మదరసా పోలింగ్ కేంద్రం వద్ద బీఎన్‌పీ, జమాత్-ఏ-ఇస్లామీ మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది. జమాత్ తరపున ప్రచారం చేస్తున్న మదరసా ప్రిన్సిపాల్‌ను మొహిబుజ్జమాన్ కోచీ అడ్డుకునే ప్రయత్నంలో ఈ ఘటన సంభవించింది.మదరసా ప్రిన్సిపాల్.. కోచీని తోసేశారని, దీంతో కోచీ ఒక చెట్టుకు తల తగిలి మరణించారని బీఎన్‌పీ నేత ఒకరు ఆరోపించారు.
ఈ ఘటనను పోలీసులు ధృవీకరించారు. కోచీని ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.మరోవైపు, దేశంలోని పలు ప్రాంతాల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై దాడులు జరుగుతున్నాయని, ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని జమాత్-ఏ-ఇస్లామీ ఆరోపించింది. ఈ విషయమై ఎన్నికల సంఘానికి, అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ సహాయ ప్రధాన కార్యదర్శి మీడియాకు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: