Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం

Read Time:  1 min
Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం
FONT SIZE
GET APP

Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై దాడులు ముగియడం లేదు. తాజాగా అక్కడ మానవత్వాన్ని మంటగలిపే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల వయసున్న, శారీరక దివ్యాంగురాలైన ఒక హిందూ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గాలకు రక్షణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read Also: Tiruppur Garment Units Raid: భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న అనుమానితులు అరెస్ట్

Bangladesh: దివ్యాంగురాలైన హిందూ యువతిపై అత్యాచారం
Bangladesh: Disabled Hindu girl raped

కేసు నమోదు

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక హిందూ సంఘాలు, మానవ హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటనపై బంగ్లాదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలని, ఇలాంటి అకృత్యాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని పౌర సమాజం ముక్తకంఠంతో కోరుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.