బంగ్లాదేశ్‌లో(Bangladesh Crisis) పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న భారత దౌత్యవేత్తలు, అధికారుల కుటుంబ సభ్యులను భారత్‌కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢాకాలోని హై కమిషన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న అధికారులు తమ కుటుంబాలను స్వదేశానికి పంపాలని విదేశాంగ శాఖ సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే వారిని ఎప్పుడు రప్పిస్తారన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు.
Read Also: Spain: ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదంపై విజయం: జైశంకర్
దౌత్య కార్యాలయాలు కొనసాగుతాయి
భారత్‌కు బంగ్లాదేశ్‌లోని(Bangladesh Crisis) దౌత్య కార్యాలయాలు మూసివేయడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఢాకాలో హై కమిషన్‌తో పాటు చఠోగ్రామ్, ఖుల్నా, రాజ్‌షాహీ, సిల్హెట్‌లో ఉన్న అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేస్తూనే ఉంటాయని వెల్లడించారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్‌ను “ఫ్యామిలీ-లెస్ పోస్టింగ్”గా పరిగణించాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే విధానం ఇప్పటికే పాకిస్థాన్‌లో అమలులో ఉంది.
మైనారిటీలపై దాడుల గణాంకాలపై భిన్న వాదనలు
బంగ్లాదేశ్‌లో గత ఏడాది మైనారిటీలపై 645 దాడులు జరిగాయని తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ కార్యాలయం వెల్లడించింది. వీటిలో 71 ఘటనలకు మతపరమైన కోణం ఉందని, ఆలయాలపై 38 దాడులు నమోదయ్యాయని తెలిపింది. చాలా కేసుల్లో పోలీసులు చర్యలు తీసుకుని అరెస్టులు చేసినట్లు పేర్కొంది. అయితే ఈ గణాంకాలను బంగ్లాదేశ్ హిందూ–బౌద్ధ–క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఖండించింది. వారి లెక్కల ప్రకారం, ఇటీవల నెలల్లో హింస ఘటనలు ఎక్కువగా నమోదయ్యాయని, హత్యలూ చోటుచేసుకున్నాయని తెలిపింది.
రాజకీయ అస్థిరత, భారత్ ఆందోళన
2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత రాజకీయ అస్థిరత పెరిగి, నిరసనలు, అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాల మధ్య మైనారిటీలపై, ముఖ్యంగా హిందువుల ఇళ్లు, వ్యాపారాలు, దేవాలయాలపై దాడులు పెరిగాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిస్థితులపై జనవరి 9న భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మతపరమైన హింసను అరికట్టేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: