📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Bangladesh crime: హిందువులపై దాడులు భారత్, బ్రిటన్ ఆందోళన

Author Icon By Tejaswini Y
Updated: January 9, 2026 • 7:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bangladesh crime: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై కొనసాగుతున్న దాడుల పరంపరపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఖండించింది. ఈ దాడులను తక్షణమే నిలిపివేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్(Randhir Jaiswal) స్పష్టం చేశారు.

Read also: Indian attacked in Thailand : థాయ్‌లాండ్‌లో భారతీయుడిపై ట్రాన్స్‌జెండర్ల దాడి , పట్టాయలో కలకలం

Bangladesh crime: Attacks on Hindus concern India and Britain

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింస

అతివాద మూకలు హిందువులకు(Hindu Minority Attacks) చెందిన ఇళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసానికి పాల్పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయ ప్రేరణలతో జరుగుతున్న ఈ ఘటనలు మైనారిటీ వర్గాల్లో భయాందోళనలను పెంచుతున్నాయని అన్నారు. మైనారిటీల ప్రాణ, ఆస్తి భద్రతను కల్పించడం బంగ్లాదేశ్ ప్రభుత్వ బాధ్యతేనని భారత విదేశాంగ శాఖ గుర్తుచేసింది. ఇదే సమయంలో ఈ అంశం అంతర్జాతీయంగా కూడా చర్చకు దారితీసింది.

బ్రిటన్‌కు చెందిన పార్లమెంట్ సభ్యురాలు ప్రీతి పటేల్ ఈ ఘటనలపై స్పందిస్తూ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల విషయంలో జోక్యం చేసుకోవాలని బ్రిటన్ ఫారెన్ సెక్రటరీకి లేఖ రాసినట్లు సమాచారం. మైనారిటీల హక్కులు, మత స్వేచ్ఛను కాపాడేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు దక్షిణాసియా ప్రాంత స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

bangladesh Hindu Minority Attacks India condemns Ministry of External Affairs Minority Rights Randhir Jaiswal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.