📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Bangladesh: భారత్ మా ఫ్రెండ్ అంటూ చైనా, పాక్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్

Author Icon By Sharanya
Updated: August 6, 2025 • 12:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్, బంగ్లాదేశ్ పొరుగు దేశాలు. పాకిస్తాన్ లాగా బంగ్లా కూడా దాయాది దేశం. దేశాలు విడిపోయినా స్నేహం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. అయితే కొన్ని నెలలుగా ఈ సంబంధానికి బీటలు పడ్డాయి.

Bangladesh:

బంగ్లాదేశ్లో రాజకీయ మార్పులే దీనికి కారణం

ఆ దేశానికి ప్రధానిగా షేక్ హసినా ఉన్నంతవరకు భారత్ (India) తో బంగ్లాదేశ్ (Bangladesh)కు స్నేహసంబంధాలే కొనసాగాయి. అయితే ఆమెను దేశం నుంచి వెళ్లగొట్టారో, ఆమె ఇండియా వచ్చి తలదాచుకుందో.. అప్పటి నుంచి పరిస్థితులు మారిపోయాయి. బంగ్లాదేశ్ భారత్పై కత్తికట్టింది. మొహ్మద్ యూనస్ సారధ్యంలో భారత్పై తిరుగుబాటు మొదలైంది. అక్కడ హిందువులపై దాడులు చేశారు. మనదేశానికి సంబంధించిన చరిత్ర ఆనవాళ్లను కూలగొట్టారు. అంతేకాదు మరో రెండు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో చేతులు కలపడానికి బంగ్లాదేశ్ ప్రయత్నించింది. అక్కడి
నేతలతో తరచూ సంప్రదింపులు జరుపుతూ, వారి దేశాలకు పర్యటనకు వెళుతూ.. భారత్పై అవాకులు, చవాకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ చాలానే చేసింది.

రెండు దేశాలకు చెక్కెట్టిన బంగ్లా

కాగా తాజాగా పాకిస్తాన్, చైనా దేశాలకు బంగ్లాదేశ్ చెక్ పెట్టింది. పాకిస్తాన్, చైనా ఆశను వమ్ముచేస్తూ పెద్ద ప్రకటన చేసింది బంగ్లాదేశ్ (Bangladesh). భారత్కు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ భూమిని వాడుకోవడానికి ఎప్పటికీ ఒప్పుకోమని తేల్చి చెప్పింది. బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా (Riyaz Hamidullah) ఈ విషయాన్ని ప్రకటించారు. భారత్, బంగ్లా మధ్య సంబంధాలు దశాబ్దాల నాటివని అవి నమ్మకం, ఉమ్మడి ఆర్థిక ప్రయోజనాలు, సాంస్కృతిక పునాదులపై నిర్మించబడ్డాయని హమీదుల్లా స్పష్టం చేశారు. రెండు దేశాలకు ముప్పు వాటిల్లే పని ఎప్పటికీ చేయమని చెప్పారు. పాకిస్తాన్ లేదా చైనాతో బంగ్లాదేశ్ ప్రవర్తన సైద్ధాతిక మార్పుకు సంకేతమనే భావనను ఆయన తిరస్కరించారు. మైనారిటీలు, హిందువుల మీద జరిగిన దాడులను బట్టి మొత్తం బంగ్లాదేశ్ను నిర్వచించలేరిన హమీదుల్లా స్పష్టం చేశారు. చైనాతో తమ సంబంధం ఆర్థికపరమైనవి మాత్రమేనని ఆయన అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/donald-trump-oh-no-i-didnt-say-that-trump/international/526727/

bangladesh bangladesh india relations Breaking News China Pakistan Shock India Friend Bangladesh latest news South Asia politics Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.