Bangladesh: బంగ్లాదేశ్ లో హింసాకాండ కొనసాగుతూనే ఉంది. ప్రముఖ విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యోదంతం మరిచి పోకముందే, అదే పార్టీకి చెందిన మరో నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. సోమవారం ఉదయం ఖుల్నా నగరంలో నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) నేత మహమ్మద్ మొతాలెబ్ షిక్టర్ పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఉదయం 11.45 గంటల సమయంలో దుండగులు షిక్టర్ ను లక్ష్యంగా చేసుకుని కాల్చడంతో బుల్లెట్ ఆయన తలలోకి దూసుకెళ్లింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, చికిత్స అందిస్తున్నామని దర్యాప్తు అధికారి అనేమేష్ మోండల్ తెలిపారు.
Read also: Bangladesh: మారణహోమాన్ని ఆపడానికే భారత్ కు వచ్చాను.. షేక్ హసీనా
Another student leader shot at
ముసుగులు ధరించి హాదీని చంపిన దుండగులు
ఘటనపై విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. ముసుగులు ధరించి హాదీని చంపిన దుండగులు గతవారం డిసెంబరు 12న ఢాకాలో ఎన్ సీపీకే చెందిన ప్రముఖ నేత షరీఫ్ ఉస్మాన్ హాదీని ముసుగులు ధరించిన దండగులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో గుర్తింపు పొందిన హాదీ, మాజీ ప్రధాని షేక్ హసీనాను గద్దె దించడానికి కారణమైన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణం దేశవ్యాప్తంగా నిరసనలు, హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా మైనారిటీలపై దాడులు పెరిగాయి. వచ్చే
ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: