📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కుప్పకూలిన విమానం.. ప్రముఖ రేసర్ కన్నుమూత బంగ్లాదేశ్ లో దారుణం ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం

Bangladesh: హిందూ యువకుడు దీపూ హత్య కేసులో 7 మంది అరెస్టు

Author Icon By Tejaswini Y
Updated: December 20, 2025 • 3:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ (27) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దీపూపై మూక దాడి జరిపి హత్య చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయడంతో, తాత్కాలిక యూనస్ ప్రభుత్వం స్పందించింది. తమ పాలనలో ఇటువంటి మూకహింసలకు ఏమాత్రం సహనం ఉండదని ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్పష్టం చేశారు.

Read also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై దాడులు కలకలం: క్రిస్టియన్ యువతిపై దాడి

Bangladesh: 7 people arrested in the murder case of Hindu youth Deepu

దీపూ హత్య కేసుపై బంగ్లాదేశ్ ప్రభుత్వ హెచ్చరిక

దీపూ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశంలో జరుగుతున్న అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ప్రత్యేక కమిషన్ దర్యాప్తు చేపడుతోందని వెల్లడించారు. ప్రజలు శాంతియుతంగా వ్యవహరించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.

ఈ కేసులో బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్(Rapid Action Battalion) ఏడుగురిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో లిమోన్ సర్కార్, తారెక్ హొస్సేన్, మానిక్ మియా, ఇర్షాద్ అలీ, నిజుముద్దీన్, అలోమ్‌గిర్ హొస్సేన్, మీర్జా హొస్సేన్ అకోన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ ఘటన మైమెన్‌సింగ్ జిల్లా వాలుకా ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bangladesh Bangladesh mob violence Bangladesh Violence Dipu Chandradas Hindu youth murder minority attack

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.