📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర

Bangladesh: షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

Author Icon By Vanipushpa
Updated: December 26, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌(Bangladesh)లో హిందువులపై దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల దీపు చంద్రదాస్ హత్య ఘటన మరువకముందే మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపేశారు. ఇలాంటి తరుణంలో బంగ్లాదేశ్‌కు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న అక్కడ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్‌ హసీనా(sheik-hasina) నియోజకవర్గం నుంచి ఓ హిందూ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. బంగ్లాదేశ్‌ జతియ హిందూ మోహజోతే సెంట్రల్‌ కమిటీ జనరల్ సెక్రటరీ, అడ్వకేట్‌ అయిన ‘గోబింద చంద్ర ప్రమానిక్’ బరిలోకి దిగనున్నారు.

Read Also : Trump Nigeria airstrike : నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా దాడి? ట్రంప్ సంచలన ప్రకటన

Bangladesh: షేక్ హసీనా నియోజకవర్గం నుంచి హిందూ అభ్యర్థి పోటీ

2009 నుంచి 2024 వరకు హసీనా ప్రాతినిధ్యం

గోపల్‌గంజ్ 3 స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఈ స్థానం నుంచే బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా 2009 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించారు. గతేడాది చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గోపల్‌గంజ్‌ 3 స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో గోబింద చంద్ర ఈ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ప్రాధాన్యం తరించుకుంది. అంతేకాదు డిసెంబర్ 28న ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని గోబింద చంద్ర స్పష్టం చేశారు. పార్టీల నుంచి ఎంపీగా గెలిచిన వాళ్లు సాధారణ ప్రజల సమస్యలను లేవనెత్తలేకపోతున్నారని అన్నారు. అందుకే తాను ప్రజల తరఫున మాట్లాడేందుకు ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

పెరిగిన రాడికల్‌ గ్రూపుల దాడులు

గతేడాది మాజీ ప్రధాని షేక్ హాసీనా దేశం విడిచి పారిపోయిన అనంతరం యూనస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బంగ్లాదేశ్‌లో మైనార్టీలపై రాడికల్‌ గ్రూపుల దాడులు పెరిగిపోయాయి. హిందువులు, క్రైస్తవులు, సుఫిస్, అహ్మదియ్యా ముస్లింలపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడి మైనార్టీలో భయాందోళనలో కాలం వెల్లదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రాడికల్ గ్రూపులు యాంటీ ఇండియా సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని మైనార్టీలపై చేస్తున్న దాడులను సమర్థించుకుంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

Bangladesh politics Hindu Candidate Minority Representation parliamentary elections Political News Sheikh Hasina South Asia politics Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.