Latest News: Bangkok Zoo – పర్యాటకుల ముందే జూ కీపర్ ను చంపేసిన సింహాలు

Read Time:  1 min
Bangkok Zoo
Bangkok Zoo
FONT SIZE
GET APP

సింహాలు, పులులతో స్నేహం చేస్తూ, వాటితో సరదాగా ఆడుకునే వారిని సోషల్ మీడియాలో చేస్తుంటాం. క్రూరజంతువులతో స్నేహం,ఎప్పటికైనా ముప్పే అని మనందరికీ తెలుసు. మరి జూలో పనిచేసే సిబ్బంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ క్రూరజంతువులను కాపాడుతుంటారు. వాటి సంరక్షణ బాధ్యతలు ఆ సిబ్బందే చూసుకోవాలి. ఇలాంటప్పుడు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. ప్రత్యేకంగా సింహాలు, పులుల సంరక్షణ సిబ్బంది (Tiger conservation staff) ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పనిచేయాల్సి వస్తుంది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇట్టే ప్రాణాలు పోతాయి. ఇలాంటి సంఘటనే ఒకటి బ్యాంకాక్ లో జరిగింది.

కారులో నుంచి ఎన్ క్లోజర్లోకి దిగిన జూ కీపర్

బ్యాంకాక్ (Bangkok) లోని ప్రముఖ టూరిస్టు స్పాట్ సఫారీ వరల్డ్ జూలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పర్యాటకుల కళ్లముందే జూ కీపర్ ను,సింహాలు దారుణంగా చంపేశాయి. జియాన్ రంగ ఖరసమీ అనే వ్యక్తి సఫారీ వరల్డ్ జూలో గత 20 సంవత్సరాలుగా జూకీపర్గా,పనిచేస్తున్నారు.. జీప్ పర్యాటకులకు సింహాలను చూపించేందుకు సఫారీకి తీసుకెళ్లాడు.

ఈ క్రమంలో ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన,తన కారులో నుంచి సింహాల ఎన్ క్లోజర్లోకి దిగాడు. దీంతో మూడు సింహాలు (lions) అతనిపై దాడికి దిగాయి. పర్యాటకులు ఎదుటే 15నిమిషాల పాటు అతనిపై దాడిచేశాయి. తీవ్రంగా గాయపడిన అతడిని జూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆయన అప్పటికే చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు.

అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు


ఈసింహాల దాడిని అడ్డుకునేందుకు పర్యాటకులు ప్రయత్నించారు. వాటి దృష్టిని మరల్చేందుకు హారన్ కొట్టడంతోపాటు ఈళలు, పెద్ద కేకలు వేశారు. అయినా అవి పట్టించుకోకుండా తమ పనికానిచ్చేశాయి. ఈ ఘటనతో పర్యాటకులు (Tourists) భయాందోళనలకు గురయ్యారు. దీంతో
అప్రమత్తమైన అధికారులు జూలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా 40 ఏండ్లలో ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని అధికారులు చెప్పారు. పర్యాటకులు, సిబ్బంది రక్షణకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. ఈ జూ కీపర్ కారులో నుంచి ప్రొటోకాల్ ను ఉల్లంఘించి సింహాల ఎన్ క్లోజర్ లోకి దిగడమే ఇతను చేసిన తప్పు. క్రూరమృగాలతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఇట్టే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/charlie-kirk-dont-give-visas-to-indians-charlie-kirks-comments-are-going-viral/international/545264/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.