థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో (Bangkok shooting) ఓ దుండగుడు అక్కడి స్థానికులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. అనంతరం దుండగుడు కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ జరుపుతున్నారు.

స్థానిక మీడియా సంస్థలు తెలిపిన వివరాల ప్రకారం.. బ్యాంకాక్లో (Bangkok shooting)ఓర్ టు కో మార్కెట్లో (ore to co market) ఓ సాయుధుడు చొరబడ్డాడు.
కాల్పుల్లో సెక్యూరిటీ గార్డులున్నారు
సాయుధుడు తనవద్ద ఉన్న తుపాకితో కాల్పులు (Gunfire) జరిపాడు. ఈ కాల్పుల్లో నలుగురు సెక్యూరిటీ గార్డులు, ఓ మహిళ మృతి చెందారు. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశమైన చతుచక్ మార్కెట్ దగ్గర్లోని ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎందుకంటే థాయ్లాండ్-కంబోడియాల మధ్య సరిహద్దుల దగ్గర కాల్పులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలకు బ్యాంకాక్ లో జరిగిన కాల్పులకు ఏమైనా సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళన కలిగిస్తోన బ్యాంకాక్ వరుస దాడులు
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా బ్యాంకాక్లో దాడులు పెరిగిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మే నెలలో కూడా థాంగ్ అనే జిల్లాలో ఓ పాఠశాల దగ్గరల్లో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా బ్యాంకాక్ లో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపుతోంది. కాల్పుల తర్వాత నిందితుడు కూడా తనంతటా తాను కాల్పుకొని ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీనివెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Operation Sindoor : త్రివిధ దళాల పరాక్రమాన్ని చూసి పాక్ తట్టుకోలేకపోయింది ..రాజ్‌నాథ్ సింగ్