📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: BAN vs SL – బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘన విజయం

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో శ్రీలంక జట్టు విజయంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక జట్టు అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్‌లో వానిందు హసరంగా చెలరేగగా, బ్యాటింగ్‌లో పాతుమ్ నిస్సంక అద్భుతమైన హాఫ్ సెంచరీ (Half a century) తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ (Bangladesh) మొదట బ్యాటింగ్ చేపట్టింది. లంక బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా బ్యాట్స్‌మెన్లు స్వేచ్ఛగా రాణించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగారు. జాకెర్ అలీ 34 బంతుల్లో 2 ఫోర్లతో 41 పరుగులు సాధించాడు. అలాగే షమీమ్ హొస్సేన్ (Shamim Hossain) 34 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

BAN vs SL

కీలక ఇన్నింగ్స్

మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేకపోవడంతో బంగ్లాదేశ్ స్కోరు మితమైన స్థాయిలోనే ఆగిపోయింది.అనంతరం శ్రీలంక 14.4 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కమిల్ మిషార(32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరి ధాటికి 32 బంతులు మిగిలి ఉండగానే శ్రీలంక లక్ష్యాన్ని చేధించింది. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్(2/29) రెండు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, తంజిమ్ హసన్ షకీబ్ చెరో వికెట్ పడగొట్టారు.

Read hindi news:  hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/new-zealand-coach-gary-steed-to-be-appointed-as-andhra-team-coach-soon/sports/546859/

Asia Cup 2025 Bangladesh Cricket Breaking News latest news Pathum Nissanka Sri Lanka cricket Sri Lanka victory Sri Lanka vs Bangladesh Telugu News Wanindu Hasaranga

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.