పాక్(Pakistan) పై బలూచిస్తాన్ దాడి: BLF (Black Liberation Front) ఆపరేషన్ BAMలో 50 మంది సైనికుల మృతి
దాడుల పై దృష్టి: ఆపరేషన్ BAM
బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) ఆపరేషన్ BAM పేరుతో 3 రోజుల పాటు (జూలై 9 – జూలై 11) భారీ దాడులు చేపట్టింది.
మొత్తం 84 పాక్ ఆర్మీ స్థావరాల(Pakistan Army)పై దాడులు చేశారు.
ఈ దాడుల్లో 50 మంది పాక్ సైనికులు మృతి చెందగా, 51 మందికి పైగా గాయాలు అయ్యాయి.
ISI, మిలిటరీ ఇంటెలిజెన్స్ పై దాడులు
బీఎల్ఎఫ్ ప్రకారం, 9 మంది నిఘా సంస్థల ఏజెంట్లు (ISI, MI) ఈ దాడుల్లో మరణించారు.
ఇది పాక్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.
పాక్ సైనిక సదుపాయాల నాశనం
7 మొబైల్ టవర్లను ధ్వంసం చేశారు. 22 ప్రాంతాల్లో సైనిక స్థావరాలపై దాడులు చేశారు.
పాక్ ఆర్మీకి చెందిన యుద్ధ యంత్రాలను ధ్వంసం చేశారు. 24 మైనింగ్ ట్రక్కులు, గ్యాస్ ట్యాంకర్లు నాశనం చేశారు. ఐదు కంటే ఎక్కువ నిఘా డ్రోన్లు, క్వాడ్‌కాప్టర్లను కాల్చివేశారు.
దాడులు జరిగిన ప్రాంతాలు
ఈ మొత్తం ఆపరేషన్ బలూచిస్తాన్‌లోని:
మక్రాన్, రేఖ్షాన్, కోల్వా, సరవాన్, ఝలావన్, కో-ఎ-సులైమాన్, బేలా, కచ్చివంటి ప్రాంతాల్లో జరిగింది.
బీఎల్ఎఫ్ సందేశం
పాక్ బలహీనమైందని, బలూచ్ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో అణిచివేయలేరని స్పష్టం చేసింది. దీనివల్ల పాకిస్తాన్ నిఘా వ్యవస్థ దెబ్బతింది. ఈ మొత్తం ఆపరేషన్ బలూచిస్తాన్‌లోని మక్రాన్, రేఖ్షాన్, కోల్వా, సరవాన్, ఝలావన్, కో-ఎ-సులైమాన్, బేలా, కచ్చి వంటి ప్రాంతాలలో జరిగిందని బీఎల్ఎఫ్ చెప్పింది. పాకిస్తాన్ ఇప్పుడు బలహీనంగా ఉందని..బలూచ్ ను అణిచివేయలేదని బఎల్ఎఫ్ ప్రకటించింది .
Read hindi news: hindi.vaartha.com
Read Also : Gaza : గాజాలో ఆహార పదార్థాలు కొనేందుకు బంగారం అమ్మేశాడు!