📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

B-1B Lancer Bombers: రంగంలోకి దిగిన ఘోరమైన B-1B లాన్సర్ విమానాలు

Author Icon By Tejaswini Y
Updated: March 16, 2026 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

B-1B Lancer Bombers: పశ్చిమాసియాలో ఇరాన్‌తో పెరుగుతున్న సైనిక ఘర్షణల నేపథ్యంలో అమెరికా యుద్ధ తంత్రాన్ని వేగవంతం చేసింది. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే తన వైమానిక దళంలోని అత్యంత శక్తివంతమైన B-1B లాన్సర్ బాంబర్ విమానాలను యుద్ధ క్షేత్రంలోకి దించింది. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో భాగంగా ఈ విమానాలు మధ్యప్రాచ్య ఆకాశంలో మోహరించాయి.

Read Also: Shriyanshi: బెంగళూరులో యువతికి నైతిక పాఠాలు.. పొట్టి దుస్తులపై వృద్ధురాలు ఫైర్!

B-1B Lancer Bombers: The deadly B-1B Lancer aircraft entered the field

ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్ ప్రారంభం

సౌత్ డకోటాలోని ఎల్స్‌వర్త్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి బయలుదేరిన ఈ బాంబర్ విమానాలు, నేరుగా యుద్ధ ప్రాంతానికి చేరుకున్నాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఛేదించగల సత్తా ఉన్న ఈ సూపర్‌సోనిక్ విమానాల రాక, యుద్ధం మరో స్థాయికి చేరబోతోందనే సంకేతాలను ఇస్తోంది.

B-1B లాన్సర్ ప్రత్యేకత

ఈ విమానాలు భారీ ఎత్తున పేలుడు పదార్థాలను మోసుకెళ్లడమే కాకుండా, శత్రువుల రాడార్లకు చిక్కకుండా మెరుపు దాడులు చేయగలవు. ఇరాన్‌కు వ్యతిరేకగా చేస్తున్న ఈ వ్యూహాత్మక మోహరింపు మధ్యప్రాచ్యంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా ఆస్తులు మరియు మిత్రదేశాల రక్షణే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోందని పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

B-1B Lancer Bombers B1B Lancer middle east conflict Supersonic Bombers US Air Force USA vs Iran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.