📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Azharuddin: లార్డ్స్ టెస్టు వేళ టీమిండియాపై అజారుద్దీన్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: July 10, 2025 • 5:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు భారత జట్టుకు కీలకమైనదిగా మారింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిసిన తర్వాత సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) లార్డ్స్ టెస్టుపై విశ్వాసం వ్యక్తం చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా తిరిగి రావడం భారత బౌలింగ్‌కు కొత్త శక్తిని తీసుకువచ్చిందని అభిప్రాయపడ్డారు.బర్మింగ్‌హామ్‌లో జట్టు అద్భుతంగా ఆడింది. ఆ గెలుపుతో లభించిన ఆత్మవిశ్వాసంతో నేడు బరిలోకి దిగుతోంది. బుమ్రా తిరిగి రావడంతో జట్టు (Team) కు మరింత బలం చేకూరుతుంది. ప్రస్తుతం మన బౌలింగ్ ఇంగ్లండ్ కంటే మెరుగ్గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పకుండా గెలుస్తుందని ఆశిస్తున్నాను” అని అజారుద్దీన్ అన్నారు.

మూడు సెంచరీలతో

బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ 336 పరుగుల భారీ తేడాతో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేసిన సంగతి తెలిసిందే.ఈ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే నాలుగు ఇన్నింగ్స్‌లలో మూడు సెంచరీలతో 146.25 సగటుతో 585 పరుగులు చేశాడు. మరో 18 పరుగులు చేస్తే, ఇంగ్లండ్‌లో ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రాహుల్ ద్రవిడ్ (2002లో 602 పరుగులు) రికార్డును గిల్ (Shubman Gill) అధిగమిస్తాడు. గత మ్యాచ్‌లో బుమ్రా లేకపోయినా, మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లు, ఆకాశ్ దీప్ 10 వికెట్లతో చెలరేగారు. ఇప్పుడు ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ బుమ్రా కూడా జట్టులోకి రావడంతో బౌలింగ్ విభాగం మరింత పదునెక్కింది.

Azharuddin: లార్డ్స్ టెస్టు వేళ టీమిండియాపై అజారుద్దీన్ ఏమన్నారంటే?

ఒకే మార్పు

ఇక లార్డ్స్ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ జట్టులో సైతం ఒకే మార్పు చోటుచేసుకుంది. గాయాల కారణంగా నాలుగేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ (Jofra Archer) ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. లార్డ్స్‌లో భారత్‌కు రికార్డు అంత గొప్పగా లేదు. ఇక్కడ ఆడిన 19 టెస్టుల్లో కేవలం 3 సార్లు మాత్రమే విజయం సాధించింది.

మహమ్మద్ అజారుద్దీన్ ఎవరు?

మహమ్మద్ అజారుద్దీన్ ఒక భారత మాజీ క్రికెట్ ఆటగాడు మరియు మాజీ కెప్టెన్. అతను స్టైలిష్ బ్యాటింగ్, ఫాస్ట్ ఫీల్డింగ్‌కి ప్రసిద్ధి. ఇండియా తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు.

అజారుద్దీన్ కెప్టెన్‌గా ఎన్ని మ్యాచ్‌లు నిర్వహించారు?

అజారుద్దీన్ టెస్టుల్లో 47, వన్డేల్లో 174 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అతను భారత క్రికెట్‌కి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లలో ఒకరు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: మూడో టెస్ట్‌లో కుల్దీప్ యాదవ్‌కు దక్కని అవకాశం

Azharuddin on Bumrah Breaking News India vs England 3rd Test Indian bowling strength Jasprit Bumrah comeback latest news Lord’s Test 2025 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.