📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Ayyannapatrudu: పార్లమెంటరీ 68వ సదస్సులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు

Author Icon By Rajitha
Updated: October 8, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లండన్ Ladon లోని ఇండియా హౌస్లో స్పీకరు అయ్యన్నపాత్రుడు,ఇతర ప్రముఖులు విజయవాడ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు Ayyannapatrudu బార్బడోస్లో జరగనున్న 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు (సిపిసి) లో పాల్గొంటారు. మంగళవారం నుండి ఈ నెల 10వ తేదీ వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంగళవారం లండన్ నుండి బార్బడోస్లోని బ్రిడ్జిటౌన్కు బయలుదేరి వెళ్లారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సిపిఏ) ఆంధ్రప్రదేశ్ శాఖ తరఫున ఆయన ప్రతినిధిగా హాజరవుతున్నారు. స్పీకర్ తో పాటు శాసనసభసెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర కూడా ఉన్నారు. కామన్వెల్త్ దేశాలలోని శాసనసభల సభాధ్యక్షులు తమ అనుభవాలను పంచుకోవడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి మరియు ఆధునిక శాసనసభలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను చర్చించడానికి ఈ సదస్సు ఒక ప్రపంచ వేదికను అందిస్తుంది.

YS Jagan: 10 నుంచి రచ్చబండ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ

Ayyannapatrudu

68వ సిపిసి సదస్సుకు బార్బడోస్ పార్లమెంట్ మరియు సిపిఏ బార్బడోస్ శాఖ ఆతిథ్యం ఇస్తున్నాయి. కామన్వెల్త్ పార్లమెంటేరియన్ల అతిపెద్ద సమావేశంగా సిపిసికి పేరుంది. ఈ సదస్సుకు కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సిపిఏ) సభ్య దేశాల నుండి స్పీకర్లు, సభాధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు మరియు పార్లమెంటరీ సిబ్బంది హాజరవుతారు. జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మరియు ప్రాదేశిక శాసనసభలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఏకైక పార్లమెంటరీ సంఘం సిపిఏ. సిపిఏ సభ్యత్వంలో దాదాపు 180 పార్లమెంట్లు మరియు శాసనసభలు ఉన్నాయి. భారత బృందానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నాయకత్వం వహిస్తారు. ఈ పర్యటన సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ శాసనసభ తరఫున 685 కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు, సిపిఏ జనరల్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడం మాకు సంతోషంగా ఉంది. సిపిఏ వార్షిక సదస్సు కామన్వెల్త్ పార్లమెంట్లలోని సహచరులతో ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, నేర్చుకోవడానికి సభ్యులకు అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఈ అనుభవం ఆంధ్రప్రదేశ్ శాసనసభ పనితీరును మరింత మెరుగుపరచడంలో సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను,” అని అన్నారు.

ది కామన్వెల్త్ గ్లోబల్ పార్టనర్ అనే ప్రధాన ఇతివృత్తంతో 68వ సిపిసి సదస్సు జరగనుంది. ప్రజాస్వామ్యానికి మద్దతుగా పార్లమెంట్లను బలోపేతం చేయడం, పార్లమెంట్లను మార్చేందుకు సాంకేతికత మరియు కృత్రిమ మేధ (ఎఐ) ను ఉపయోగించడం, ప్రపంచ ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిశీలించడం, శాసనసభలపై విశ్వాసం పెంచడంఖి వంటి అనేక అంశాల పై ఈ సదస్సులో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రతినిధిగా అయ్యన్నపాత్రుడు ప్రజాస్వామ్యానికి మద్దతుగా మన సంస్థలను బలోపేతం చేయడం. ప్రజాస్వామ్యంలో విశ్వాసం మరియు పారదర్శకతను పెంచడం: పార్లమెంట్లు, ఎన్నికలలో ఆర్థిక పారదర్శకత., జాతీయ పార్లమెంట్లు వర్సెస్ ప్రాంతీయ, ప్రాదేశిక బదిలీ చేయబడిన శాసనసభలు: అధికారాల విభజనను రక్షించడం మరియు పరిరక్షించడంఖి అనే అంశాలపై జరిగే వర్క్షాప్లలో పాల్గొంటారు. ఇక రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ లండన్లో అయ్యన్నపాత్రుడు భేటీ అయ్యారు. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు బార్బడోస్లోని బ్రిడ్జాను వెళ్తున్న భారత ప్రతినిధుల గౌరవార్థం యూకేలోని భారత హైకమిషనర్ లండన్లోని ఇండియా హౌస్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పాల్గొన్నారు.

కామన్వెల్త్ పార్లమెంటరీ 68వ సదస్సులో ఆంధ్రప్రదేశ్ తరఫున ఎవరు పాల్గొంటున్నారు?ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సదస్సులో పాల్గొంటున్నారు.

ఈ సదస్సు ఎక్కడ, ఎప్పుడు జరుగుతోంది?
బార్బడోస్‌లోని బ్రిడ్జిటౌన్‌లో అక్టోబర్ 10 వరకు ఈ సదస్సు జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

68th CPC Chintakayala Ayyannapatrudu Commonwealth Parliamentary Conference latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.