ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Khamenei) ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. తాను ప్రమాదంలో ఉన్నానని ఆయనకి తెలుసు. ఇకపై ప్రశాంతంగా బయటతిరిగే పరిస్థితి ఆయనకు లేదు. ఇరాన్‌లోని నిరసనకారులకు సాయం చేయడానికి అమెరికా నెక్ట్స్ ఏం చేయవచ్చో చర్చిస్తున్నప్పుడు, ఖాసిం సులేమానీ, అబూ బకర్ అల్-బాగ్దాదీ గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావించారు. ఖాసిం సులేమానీ మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్‌కు అత్యంత కీలక సైనిక వ్యూహకర్త. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలపై జరిగిన డ్రోన్ దాడిలో 2020 జనవరి 3న బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఆయన చనిపోయారు. అబూ బకర్ అల్-బాగ్దాదీ ఐఎస్ నాయకుడు. అమెరికా అధ్యక్షుడి అనుమతితో ఉత్తర సిరియాలో ఆయన రహస్య స్థావరంపై అమెరికా దళాలు దాడి చేసినప్పుడు, 2019 అక్టోబర్ 27న ఆత్మాహుతి బాంబును పేల్చుకుని తన ఇద్దరు పిల్లలతో సహా చనిపోయారు. మరో నేత హిజ్బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా. ఇక్కడ అయతొల్లా ఖమేనీ పరిస్థితి కూడా ఆయన పరిస్థితిలాగే ఉందని గుర్తుపెట్టుకోవాలి.
Read Also: Budget 2026: సామాన్యుడి జీవితంలోకి ఏఐ
సుప్రీమ్ లీడర్ ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నది?
2024 సెప్టెంబర్ 27న బేరూత్ లోని ఒక ఎత్తైన నివాస భవనం కింద, సుమారు 60 అడుగుల లోతులో తన ముఖ్య నేతలతో సమావేశం జరుపుతుండగా, ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసి ఆయన్ను చంపగలిగింది. ఇటీవల కారకస్‌లో వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు కమాండో తరహా దాడిచేసి పట్టుకున్న విషయం అయతొల్లా మర్చిపోయారనుకోలేం. అయితే, ఇరాన్ నాయకుడిని నిజంగా అధికారం నుంచి తొలగించడం ఇరాన్ నిరసనల మీదా, లేదా ఇస్లామిక్ రిపబ్లిక్ భవిష్యత్తు మీదా ఎలాంటి ప్రభావం ఉంటుందో స్పష్టంగా తెలియడం లేదు. అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు తన ముందున్న ఆప్షన్లను బేరీజు వేసుకుంటున్నారు. మరి, ఇరాన్ సుప్రీమ్ లీడర్, ఆయన ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నది ప్రశ్న. 86 ఏళ్ల అయతొల్లా ఖమేనీ చాలా మంది ఇరానియన్లు ద్వేషించే వ్యక్తి. చాలా ఏళ్లుగా, దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆయన గద్దే దిగాలని కోరుకుంటున్నారు. ఆయన భయంకరమైన నాయకుడని స్పష్టమైంది. ఆయన పాలన ప్రపంచంలోనే అత్యంత అణచివేత పాలనల్లో ఒకటిగా పేరు సంపాదించింది.
ఊచకోత కోయడానికి అయతొల్లా ఖమేనీ భద్రతా దళాలకు గ్రీన్ సిగ్నల్
మధ్యప్రాచ్యంలో అధికారాన్ని ప్రదర్శించడానికి ఖమేనీ చేసిన ప్రయత్నాలు ఆ ప్రాంతాన్ని అగ్నికి ఆహుతి చేశాయి. ఇజ్రాయెల్ నాశనం కోసం ఆయన ఇచ్చిన పిలుపు ఇజ్రాయెల్‌తో యుద్ధాలకు దారితీసింది. ఇటీవలి నిరసనలలో, నిరసనకారులను ఊచకోత కోయడానికి అయతొల్లా ఖమేనీ భద్రతా దళాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇరాన్‌లో ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల వల్ల హింస ఎంత విస్తారంగా ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. పట్టణాలు, నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా భద్రతా దళాల చేతిలో వేలమంది మరణించారు. దీనినిబట్టి నిరసనలు ఎంత విస్తారంగా జరిగాయో అర్ధమవుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా లేదా కమాండో దాడి ద్వారా ఖమేనీని తొలగిస్తే కచ్చితంగా పాలనలో మార్పును చూపించాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: