📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Aaxiom Mission 4: రెండు వారాల్లో కోటి కిలోమీటర్లు ప్రయాణం చేసిన యాక్సియం బృందం

Author Icon By Vanipushpa
Updated: July 11, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత వ్యోమగామి(Indian astronauts) శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)తో కూడిన యాక్సియం 4(Aaxiom Mission 4) బృందం రెండు వారాల్లో 230 సూర్యోదయాలను వీక్షించారు. దీంతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సుమారు కోటి కిలోమీటర్లు దూరం ప్రయాణించినట్లు యాక్సియం స్పేస్​(Aaxiom Space) వెల్లడించింది. 250 మేళ్ల ఎత్తులో నుంచి తమ డౌన్​టైమ్ చిత్రాలు, వీడియోలను తీసిందని చెప్పింది. భూమిని చూస్తూనే తమ ప్రియమైన వారితోనూ మాట్లాడారని పేర్కొంది. తమ రోజూవారీ కఠిన షెడ్యూల్​లో ఇలాంటి క్షణాలు కాస్త విరామాన్ని ఇస్తాయని తెలిపింది.

నాసా అనుమతి కోసం ఎదురుచూపులు

మరోవైపు శుభాంశు శుక్లాతోపాటు పెగ్గీ విట్సన్‌ (అమెరికా), స్లావోస్జ్‌ ఉజ్నాన్స్‌కీ -విస్నీవ్‌స్కీ (పోలండ్‌), టిబర్‌ కపు (హంగరీ) ఐఎస్​ఎస్​లో తమ చివరి రోజును గడిపారు. కాగా తిరిగి భూమిపైకి వచ్చేందుకు నాసా అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యాగ్జియం-4 ప్రైవేట్‌ స్పేస్‌ మిషన్‌లో భాగంగా ఫాల్కన్‌-9 రాకెట్‌ ద్వారా వీరందరూ కలిసి జూన్ 25న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరారు. దాదాపరు 28 గంటల ప్రయాణం తర్వాత డ్రాగన్ అంతరిక్ష నౌక మరుసటి రోజు అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు.

Aaxiom Mission 4: రెండు వారాల్లో కోటి కిలోమీటర్లు ప్రయాణం చేసిన యాక్సియం బృందం

అంతరిక్షంలోకి వెళ్లినప్పటి నుంచి శుక్లాతో పాటు ఇతర వ్యోమగాములు అనేక ప్రయోగాలు చేపట్టారు. బయోమెడికల్ సైన్స్, అధునాతన పదార్థాలు, న్యూరోసైన్స్, వ్యవసాయం, అంతరిక్ష సాంకేతికతతో కలిపి దాదాపు 60కి పైగా ప్రయోగాలు చేపట్టారు. దీంతో ఇప్పటివరకు అత్యధిక పరిశోధనలను నిర్వహించిన యాగ్జియం స్పేస్ ప్రైవేట్ వ్యోమగామి మిషన్‌గా ఆక్సియమ్-4 మిషన్ నిలిచింది. ఈ పరిశోధనలు మానవ అంతరిక్ష అన్వేషణతో పాటు భూమిపై జీవనాన్ని మార్చగలవని అంటున్నారు. డయాబెటిస్ నిర్వహణ, వినూత్న క్యాన్సర్ చికిత్సలు, మానవ ఆరోగ్యం మానిటర్ చేయడంలో పురోగతి సాధిస్తాయని చెబుతున్నారు.

తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావంపైనా అధ్యయనం

ముఖ్యంగా శుక్లా ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై పరిశోధన చేపట్టారు. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాముల బృందం తమ మానసిక ఆరోగ్యంపై ప్రభావంపైనా అధ్యయనం నిర్వహించింది. ఆ తర్వాత భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రైతుగానూ మారి పరిశోధనలు చేశారు. రోదసిలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి, పెసర సాగుపై ఉండే ప్రభావాలపై ఐఎస్‌ఎస్‌లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా చిన్నపాటి గాజు పాత్రల్లో పెసర, మెంతి విత్తనాలను వేసి, ఐఎస్‌ఎస్‌లోని నిల్వ ఫ్రీజర్‌లో ఉంచారు. అనంతరం జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని శుక్లా పరిశోధన చేపట్టారు.

విద్యార్థులతో ముచ్చటించిన శుక్లా
అంతకుముందు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో నుంచి భారతీయ విద్యార్థులతో ముచ్చటించారు వ్యోమగామి శుభాంశు శుక్లా. ఐఎస్‌ఎస్‌ నుంచి హామ్‌ రేడియో సాయంతో దాదాపు 10 నిమిషాల పాటు చిన్నారులు వేసిన దాదాపు 20 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. షిల్లాంగ్‌లోని నార్త్‌ఈస్ట్‌ స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ఎన్‌ఈఎస్‌ఏసీ)కు వచ్చిన మేఘాలయ, అస్సాంలోని ఏడు పాఠశాలలకు చెందిన చిన్నారులతో ఐఎస్​ఎస్​లో తన అనుభవాలను పంచుకున్నారు. .

ఆక్సియం 4 లో ఎంత మంది భారతీయ వ్యోమగాములు ఉన్నారు?
65 ఏళ్ల విట్సన్ మరియు ఆమె ముగ్గురు ఆక్సియం 4 సిబ్బంది - శుభాన్షు శుక్లా, 39, భారతదేశానికి చెందిన, స్లావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నివ్స్కీ, 41
ఆక్సియమ్ 4 మిషన్ లక్ష్యం ఏమిటి?
ఆక్సియమ్ మిషన్ 4 (యాక్స్-4) అనేది ఆక్సియమ్ స్పేస్ నిర్వహించే ప్రైవేట్ అంతరిక్ష విమానం. ఇది 14 రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సిబ్బందిని రవాణా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది వారి మునుపటి మిషన్ల (యాక్స్-1, యాక్స్-2, మరియు యాక్స్-3) తర్వాత ISSకి ఆక్సియమ్ స్పేస్ యొక్క 4వ మిషన్ అవుతుంది.

Read hindi news: hindi.vaartha.com

read also: Microsoft: భారీగా లేఆఫ్ ను ప్రకటించిన మైక్రోసాఫ్ట్!

#telugu News Astronauts Axiom Crew Axiom Space ISS Mission space mission Space Travel SPACEX Two Week Space Journey

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.