📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ

Australia: పుట్టగొడుగులతో విందు.. ముగ్గురి మృతి కేసులో దోషిగా తేలిన మహిళ

Author Icon By Shobha Rani
Updated: July 7, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుటుంబ సభ్యులకు విషపూరిత పుట్టగొడుగులతో వండిన ఆహారాన్ని తినిపించి, వారిలో ముగ్గురి మరణానికి కారణమైన కేసులో ఆస్ట్రేలియా(Australia)కు చెందిన ఓ మహిళను కోర్టు దోషిగా నిర్ధారించింది. మరొకరిపై హత్యాయత్నం చేసినట్టు కూడా తేల్చింది. ఈ సంచలన ఘటనలో 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్‌ను విక్టోరియా సుప్రీంకోర్టు జ్యూరీ సోమవారం దోషిగా ప్రకటించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..

2023 జులైలో (Australia) మెల్‌బోర్న్‌(Melbourne)కు 110 కిలోమీటర్ల దూరంలోని లియోన్‌గాథ పట్టణంలో ఉన్న తన నివాసంలో ఎరిన్ ప్యాటర్సన్ ఒక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు హాజరైన ఆమె భర్త తల్లిదండ్రులు డాన్, గేల్ ప్యాటర్సన్‌తో పాటు, గేల్ సోదరి హీథర్ విల్కిన్సన్ ఆ ఆహారం తిని కొద్దిరోజులకే మరణించారు. హీథర్ భర్త ఇయాన్ విల్కిన్సన్ తీవ్ర అస్వస్థతకు గురై, ఆసుపత్రిలో వారాలపాటు చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డారు.
10 వారాల విచారణ – కోర్టు కీలక నిర్ణయం
దాదాపు 10 వారాల పాటు సాగిన విచారణలో ప్రాసిక్యూషన్ (Australia) కీలక వాదనలు వినిపించింది. ఎరిన్ ఉద్దేశపూర్వకంగా అత్యంత ప్రమాదకరమైన ‘డెత్ క్యాప్’ పుట్టగొడుగులను సేకరించి, వాటిని ఎండబెట్టి, పొడిగా మార్చిందని ఆరోపించింది. ఆ పొడిని ‘బీఫ్ వెల్లింగ్‌టన్’ అనే వంటకంలో కలిపి అతిథులకు వడ్డించిందని జ్యూరీకి

Australia: పుట్టగొడుగులతో విందు.. ముగ్గురి మృతి కేసులో దోషిగా తేలిన మహిళ

వివరించింది. అంతేకాకుండా, తనకు క్యాన్సర్ ఉందని అబద్ధం చెప్పి వారిని విందుకు రప్పించిందని, అనుమానం రాకుండా ఉండేందుకు త‌న‌క్కూడా ఆ ఆహారం వల్ల అనారోగ్యం వచ్చినట్టు నటించిందని, పోలీసుల విచారణ మొదలవగానే సాక్ష్యాలను నాశనం చేసిందని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.

అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి ఉత్పత్తి

అయితే, ఈ ఆరోపణలను ఎరిన్ ఖండించింది. తాను నిర్దోషినని, పొరపాటున మాత్రమే విషపు పుట్టగొడుగులు వంటలో కలిసిపోయాయని వాదించింది. ఎరిన్‌తో విడిగా ఉంటున్న ఆమె భర్త సైమన్ ప్యాటర్సన్‌ను కూడా ఈ విందుకు ఆహ్వానించగా, ఆయన చివరి నిమిషంలో తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. జ్యూరీ సుదీర్ఘ విచారణ తర్వాత ఆమెను దోషిగా తేల్చింది. త్వరలోనే న్యాయస్థానం ఆమెకు శిక్షను ఖరారు చేయనుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Himachal Pradesh: హిమాచల్‌లో వర్ష బీభత్సం:

కొన్ని ముఖ్యమైన విషపూరిత పుట్టగొడుగు ఏదో తెలుసా?

డెత్ క్యాప్ (Death Cap), ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పుట్టగొడుగు.చిన్న మోతాదులోనే ప్రాణానికి ముప్పు కలుగుతుంది.

నిషేధించబడిన పుట్టగొడుగు ఇదే?

ప్సిలోసైబిన్ పుట్టగొడుగులు,వీటిని “మ్యాజిక్ మష్రూమ్స్ (Magic Mushrooms)” అని కూడా పిలుస్తారు.భారతదేశం సహా అనేక దేశాల్లో ఈ పుట్టగొడుగుల వినియోగం, ఉత్పత్తి, విక్రయం పూర్తిగా నిషేధించబడి ఉంది.

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పుట్టగొడుగు ఏదంటే?

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన,బటన్ మష్రూమ్, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినబడే పుట్టగొడుగు ఇదే. ఇది ఆహార పుష్కలత, తక్కువ కొలెస్ట్రాల్, పీచు పదార్థాలు, విటమిన్లు కలిగి ఉంటుంది.

Australia murder case Breaking News Erin Patterson latest news mushroom poisoning Victoria Supreme

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.