📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Australia: బోండీ బీచ్ లో కాల్పులు.. దర్యాప్తులో భారత బృందం

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 4:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బోండీ బీచ్ లో(Australia) ఆదివారం హనుక్కా ఉత్సవం వేళ ఉగ్రదాడి జరిగిన విషయం విధితమే. ఈ దాడిలో 16మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ప్రపంచదేశాలు ఉలిక్కిపడేలా చేసింది. దీనిపై సమగ్ర విచారణ చేసేందుకు ఆస్ట్రేలియా యత్నిస్తున్నది. ఆస్ట్రేలియాలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది సాజిత్ అక్రమ్ (50)ను హైదరాబాదీగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రదాడి దర్యాప్తులో ఆస్ట్రేలియా అధికారులకు సాయం చేసేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Read also: Messi: అనంత్ అంబానీ మెస్సీకి రూ. 11 కోటి రిచర్డ్ మిల్లే వాచ్ గిఫ్ట్

Indian team in the investigation

దర్యాప్తు భాగం కావాలని భారత్ నిర్ణయం

ఉగ్రదాడి నిందితుల్లో ఒకరైన సాజిత్ భారత పాస్పోర్టును కలిగి ఉండటంతో పాటు నాలుగేళ్ల క్రితం అతడు ఇక్కడికి వచ్చినట్లు తెలంగాణ డీజీపీ కార్యాలయం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దర్యాప్తులో భాగం కావాలని భారత్(India) భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ దర్యాప్తు బృందంలో రాష్ట్ర పోలీసు విభాగాలు, కేంద్ర నిఘాసంస్థలకు చెందిన అధికారులు ఉంటారని వెల్లడించాయి. (Australia) యూదులను లక్షణయంగా చేసుకొని హింసకు పాల్పడిన వ్యక్తి నేపథ్యం, చేసిన ప్రయాణాల గురించి తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా అధికారులతో కలిసి పని చేయనున్నట్లు తెలిపాయి.

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలపై ఆరా

నాలుగేళ్ల క్రితం నిందితుడు తన తల్లిని కలిసేందుకు చేసిన భారత పర్యటనపై కూడా దృష్టిసారించనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి . భారత్ కు వచ్చిన ఉద్దేశం, వెళ్లిన ప్రదేశాలు, కలిసిన వ్యక్తుల గురించి దర్యాప్తు బృందం తెలుసుకోనుంది. నిందితుడికి ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైనా దృష్టి సారించినట్లు సమాచారం. భారత్ లో అతడికున్న పరిచయాలు, స్లీపర్ సెల్స్ ఎవరినైనా నియమించాడా అనే కోణంలో కూడా విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంబంధించిన ఆన్ లైన్ కార్యకలాపాలు, ఆర్థిక లావాదేవీలపై భారత దర్యాప్తు ఏజెన్సీలు ఇప్పటికే దృష్టి సారించాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Australia Terror Probe Bondi Beach attack Counter-terrorism support Hyderabad Connection Indian Investigation Team Sajit Akram Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.