📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Australia: సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. భారతీయ మహిళ మృతి

Author Icon By Sushmitha
Updated: November 19, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాహనాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తు, మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్లే అధికసంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. తద్వారా క్షణాల్లో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ప్రమాదాలు ఇక్కడ అక్కడ అని లేదు. అన్నిదేశాల్లోనూ జరుగుతున్నాయి. కాకపోతే భారతదేశంలో ఈ ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడం విచారకరం. తాజాగా ఆస్ట్రేలియాలోని (Australia) సిడ్నీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ (Indian) మహిళ మృతి చెందింది. మృతురాలు 33 ఏళ్ల సమన్విత ధారేశ్వర్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆమె 8నెలల గర్భిణి. సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆమె తన రెండవ బిడ్డను స్వీకరించడానికి కొన్ని వారాల దూరంలో ఉండగా ఈ ఘటన జరగడం అందర్ని కలిచి చేసింది.

 Read Also: TTD: మరింత లోతుగా అప్పన్నకు సిట్ ప్రశ్నలు

Australia Indian woman dies in road accident in Sydney

రోడ్డు దాటేయత్నంలో ప్రమాదం

సమన్విత ఆమె భర్త, కొడుకు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా, అటువైపుగా ఓ కియా కార్నివాల్ కారు డ్రైవర్ వారికి దారి ఇచ్చేందుకు వేగాన్ని తగ్గించారు. సరిగ్గా అదే సమయంలో, వెనుకవైపు నుంచి అతివేగంగా వచ్చిన ఒక బిఎండబ్ల్యూ సెడాన్,(BMW Sedan) కియా కారును బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి కియా కారు అమాంతం ముందుకు దూసుకుపోయి, రోడ్డు దాటుతున్న సమన్వితను బలంగా తాకింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.

తల్లిని, గర్భస్థ శిశువును కాపాడేందుకు యత్నించిన వైద్యులు ప్రమాద సమాచారం అందుకున అత్యవసర సిబ్బంది వవెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సమన్వితకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెను, ఆమె గర్భస్థ శిశువును కాపాడటానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, ఫలితం దక్కలేదు.

తల్లి, గర్భస్థ శిశువు ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాదానికి కారణమైన బిఎండబ్ల్యూ కారును నడుపుతున్న ఆరోన్ పాపజోగ్లూ (19) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కియా కార్నివాల్ నడుపుతున్న 48 ఏళ్ల వ్యక్తి క్షేమంగా బయటపడ్డాడు. ఆనందంగా సాగు కుటుంబంలో భార్యను, కడుపులో బిడ్డను కోల్పోయిన సమన్విత భర్త వేదన వర్ణనాతీతం. రెండవ బిడ్డ కోసం ఆశతో ఎదురుచూస్తున్న తనకు ఊహించని ప్రమాదం ద్వారా భార్యను, బిడ్డను కోల్పోయి దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఒకరి నిర్లక్ష్యం ఓ కుటుంబాన్ని చిదిమేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Australia news; fatal crash Google News in Telugu Indian woman death Latest News in Telugu Sydney road accident Telugu News Today traffic tragedy.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.