📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Khalistanis: ఆస్ట్రేలియాలో స్వాతంత్య వేడుకలు..ఖలిస్థానీయులు.. భారతీయుల మధ్య గొడవ

Author Icon By Vanipushpa
Updated: August 15, 2025 • 4:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దేశంలో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియా(Australia)లో మాత్రం ఊహించని ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని కాన్సులేట్ కార్యాలయంలో స్వాతంత్య దినోత్సవ వేడుకల నిర్వహణలో ఖలిస్థానీయులు(Khalistanis) రెచ్చిపోయారు. ఈ కార్యక్రమానికి అడ్డొచ్చి గందరగోళం సృష్టించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. కాన్సులేట్‌ కార్యాయంలో జాతీయ జెండాను ఎగురవేసేందుకు భారతీయులు అక్కడికి వచ్చారు.

భారతీయులు, ఖలిస్థానీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం

దేశభక్తి గీతాలు పాడుతుండగా కొందరు ఖలిస్థానీలు అక్కడికి వచ్చారు. ఖలిస్థానీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ భారతీయులు, ఖలిస్థానీ మద్దతుదారుల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఒకరినొకరు తిట్టుకున్నారు. చివరికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖలిస్థానీ మద్దతుదారులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. స్వాతంత్య దినోత్సం రోజున ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆస్ట్రేలియాలో స్వాతంత్య వేడుకలు..ఖలిస్థానీయులు.. భారతీయుల మధ్య గొడవ

‘గో హోమ్‌ బ్రౌన్’

అంతేకాదు ఇటీవల మెల్‌బోర్న్‌లోని ఓ హిందూ గుడిపై కూడా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. ఆ గుడి గోడలపై హిట్లర్‌ చిత్రాన్ని పెట్టారు. దానిపై ‘గో హోమ్‌ బ్రౌన్’ రాశారు. మరో విషయం ఏంటంటే అంతకుముందు సిడ్నీలో ఓ భారతీయ విద్యార్థిపై కూడా కొందరు ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుపరాడ్లతో దాడి చేశారు. అలాగే జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆస్ట్రేలియా అధికారులు సైతం ఈ దాడులను ఖండించారు. ఆస్ట్రేలియాలో భావ ప్రకటన స్వేచ్ఛకు తాము మద్దతిస్తామని.. కానీ హింస, ద్వేషపూరిత ప్రసంగాలను తాము సహించమని తేల్చిచెప్పారు.

ఆస్ట్రేలియా ప్రధానమంత్రి భారతీయులకు శుభాకాంక్షలు

మరోవైపు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌ భారతీయులకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. భారత్‌తో స్నేహ బంధం ఎన్నోఏళ్లుగా కొనసాగుతోందని.. భారత్‌ సాధించిన విజయాన్ని తాము కూడా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు. ఇదిలాఉండగా ముఖ్యంగా కెనడాలో ఖలిస్థానీయులు ఎక్కువగా ఆందోళనలు చేస్తుంటారు. భారతీయులతో గొడవలకు దిగుతారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా అది కూడా స్వాతంత్య దినోత్సవం రోజున జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/america-trump-putin-meeting-today/international/530616/

Australia News Clash News Independence Day 2025 Indian Community Khalistan Protest Latest News Breaking News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.