📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest news: Social Media: సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా బ్యాన్.. ఎవరికంటే?

Author Icon By Saritha
Updated: November 10, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సోషల్ మీడియా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో మనకు తెలియని కాదు. చిన్నవయసులోనే సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. తెలిసీతెలియని వయసులో పరిచయాలు ప్రేమగా భ్రమించి, తమ కెరీర్ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. ఎవరు ఎంతగా చెబుతున్నా వినడం లేదు.అసలు ఫోన్ ఎక్కువగా వాడవద్దని చెబుతున్నందుకు కన్నవారిని హతమారుస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం కదా!  పిల్లలపై సోషల్ మీడియా తీసుకొస్తున్న అనర్థాలను దృష్టిలో ఉంచుకునే ఆస్ట్రేలియా ప్రభుత్వం కాలక నిర్ణయం తీసుకుంంది. ఆన్ లైన్(Social Media) భద్రతను నిర్ధారించడానికి 16ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రపంచంలోనే మొట్టమొదటి చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఈ నిబంధన 2025 డిసెంబరు 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం 16ఏళ్లలోపు మైనర్లు ఫేస్ బుక్,(Facebook) ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, స్నాప్ చాట్, ఎక్స్, యూట్యూబ్, రెడిట్, కిక్ వంటి ప్లాట్ఫారమ్ లలో అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడం లేదా వాడటం అనేది చట్టవిరుద్ధం అవుతుంది.

Read also: ఇక అమెరికన్ పౌరుడికి 2వేల డాలర్లు.. ట్రంప్ ఆఫర్

Social Media: సోషల్ మీడియాపై ఆస్ట్రేలియా బ్యాన్.. ఎవరికంటే?

చట్టాన్ని అమలు చేసే బాధ్యత సోషల్ మీడియా కంపెనీలదే బాధ్యత

ఆన్ లైన్ ప్రమాదాలు, సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి పిల్లలను రక్షించడానికి ఈ చట్టం రూపొందించబడిందని ప్రభుత్వం చెబుతోంది. మొదట్లో మినహాయింపు ఇవ్వాలని భావించినా, పరిశోధనల తర్వాత యూట్యూబ్ ను కూడా ఈ నిషేధ జాబితాలో చేర్చారు. అయితే ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత పూర్తిగా ఆయా సోషల్ మీడియా కంపెనీలదేని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది.

కంపెనీలకు భారీ జరిమానా

16ఏళ్ల లోపు వారు తమ ప్లాట్ ఫారమ్ లలో అకౌంట్లు క్రియేట్ చేయకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంది. ఒకవేళ నిబంధనలు పాటించడంలో విఫలమైన సోషల్ మీడియా కంపెనీలకు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ.410 కోట్లు) వరకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి ఇప్పటికే పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాలని పలువురు ప్రముఖులు కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Australia children protection digital law Latest News in Telugu minors online safety online safety act Social Media Ban social media regulation Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.