📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Australia: ఆస్ట్రేలియా స్పేస్ ప్రాజెక్ట్ తొలి ప్రయత్నం విఫలం

Author Icon By Anusha
Updated: July 31, 2025 • 2:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధన రంగంలో మైలురాయిగా భావించిన తొలి స్వదేశీ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం విఫలమైంది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ (Gilmer Space Technologies) అభివృద్ధి చేసిన ‘ఎరిస్’ రాకెట్ తన మొదటి పరీక్షా ప్రయోగంలో కేవలం 14 సెకన్లలోనే విఫలమవడం దేశానికి పెద్ద షాక్‌గా మారింది. ఈ ఘటన క్వీన్స్‌ల్యాండ్‌లోని బోవెన్ ఆర్బిటల్ స్పేస్‌పోర్ట్‌లో చోటుచేసుకోగా, రాకెట్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు, పొగలు ఆకాశాన్నంటాయి. ఈ అనూహ్య సంఘటన అంతరిక్ష పరిశోధన రంగం శాస్త్రవేత్తలకు నిరాశ కలిగించింది. గిల్మర్ స్పేస్ టెక్నాలజీస్ ‘ఎరిస్’ రాకెట్‌ను పరీక్షా ప్రయోగం కోసం సిద్ధం చేసింది. ప్రారంభంలో అన్ని వ్యవస్థలు సజావుగా పని చేస్తూ, రాకెట్ విజయవంతంగా లాంచ్ అయినట్లు కనిపించింది. అయితే నింగిలోకి ఎగసిన కేవలం 14 సెకన్లలోనే రాకెట్ ఆకస్మికంగా వేగం కోల్పోయి నియంత్రణ తప్పింది. ఫలితంగా అది కూలిపడి భూమిపై మంటలు చెలరేగాయి. అక్కడున్న సాంకేతిక నిపుణులు (Technical experts) తక్షణమే అత్యవసర చర్యలు తీసుకున్నప్పటికీ, రాకెట్ పూర్తిగా నాశనం అయింది.

తాత్కాలిక ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు

అయితే తొలి ప్రయత్నం విఫలం అయినప్పటికీ.. భవిష్యత్తు ప్రయోగాలపై ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని కంపెనీ ఒక లిఖిత పూర్వక ప్రకటనలో ధ్రువీకరించింది. తదుపరి ప్రయోగాన్ని ఆరు నుంచి ఎనిమిది నెలల్లోపు చేపట్టే అవకాశం ఉందని కూడా ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ వైఫల్యం ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధనా ప్రయత్నాలకు తాత్కాలిక ఎదురుదెబ్బగా నిపుణులు భావిస్తున్నారు. గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో తమదైన ముద్ర వేయాలని ఆశిస్తున్న ఆస్ట్రేలియాకు.. తొలి అడుగులోనే ఇలాంటి దెబ్బ తగలడంతో తదుపరి ప్రాజెక్టుపై మరింత ఫోకస్ చేస్తుందని చెబుతున్నారు.అలాగే పరిశోధన రంగంలో ఇలాంటి వైఫల్యాలు సర్వ సాధారణం అని, వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు

అంతరిక్షంలో శాస్త్రీయ ఆవిష్కరణకు ఉదాహరణ ఏది?

టెలిస్కోపిక్ పరిశీలనల ఫలితంగా గ్రహాల చుట్టూ చంద్రులు మరియు వలయాలు, మరియు కొత్త గ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు కనుగొనబడ్డాయి; గ్రహాలను ఇతర ప్రపంచాలుగా, భూమిని మరొక గ్రహంగా మరియు నక్షత్రాలను ఇతర సూర్యులుగా గుర్తించడం; సౌర వ్యవస్థను దానికదే ఒక అస్తిత్వంగా గుర్తించడం,యొక్క నిర్ధారణకు దారితీసింది.

నాసా పూర్తి రూపం ఏమిటి?

నాసా అంటే “నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్” (National Aeronautics and Space Administration). ఇది అమెరికా అంతరిక్ష పరిశోధన, ఏరోనాటిక్స్ కార్యక్రమాలకు సంబంధించిన సంస్థ.

Read hindi news : hindi.vaartha.com

Read Also: Minister Narayana : సింగపూర్ లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన-రేపు మలేషియాకు మంత్రి

Australia rocket launch failure Bowen Orbital Spaceport incident Breaking News first indigenous orbital rocket test fail Gilmore Space Technologies Eris rocket latest news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.