📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

America: భారత్‌కు అమెరికా సైనిక హార్డ్‌వేర్‌ సరఫరాతో పాటు లాజిస్టిక్ మద్దతు

Author Icon By Vanipushpa
Updated: May 2, 2025 • 12:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌కు కీలకమైన సైనిక హార్డ్‌వేర్‌ సరఫరాతో పాటు లాజిస్టిక్ మద్దతును అందించేందుకు అమెరికా అంగీకరించింది. సుమారు రూ.11వేల కోట్లు (131 మిలియన్ డాలర్లు) విలువైన ప్రతిపాదనకు అగ్రరాజ్యం ఆమోదం తెలిపింది. అమెరికా రక్షణ శాఖ ‘పెంటగాన్​’ పరిధిలోని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ (DSCA) ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనిపై అమెరికా కాంగ్రెస్‌కు కూడా సమాచారాన్ని అందజేసింది. ఇరుదేశాల మధ్యనున్న బలమైన ద్వైపాక్షిక సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్‌సీఏ వెల్లడించింది.

ప్రతిపాదనకు ఆమోదం
అమెరికా నుంచి సైనిక కొనుగోళ్లను మరింత పెంచాలని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ఒత్తిడి పెంచుతున్న వేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించడం గమనార్హం. భారత్‌కు అందనున్న సైనిక హార్డ్‌వేర్‌ల జాబితాలో సీ విజన్ సాఫ్ట్‌వేర్, రిమోట్ సాఫ్ట్‌వేర్, అనలిటిక్ సపోర్ట్ వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరికరాల నిర్వహణ, నిల్వ, పంపిణీకి ఉపయోగపడే సామగ్రి సైతం అమెరికా నుంచి భారత్‌కు అందుతుందని సమాచారం. భారత్ మాకు ముఖ్యమైన రక్షణరంగ భాగస్వామి. భారత్‌కు ఈ సైనిక సామగ్రిని సమకూర్చడం అనేది అమెరికా విదేశాంగ విధానం, జాతీయ భద్రత లక్ష్యాలతో ముడిపడిన అంశం’’ అని డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ(DSCA) ఈసందర్భంగా వెల్లడించింది.

భారత్‌కు ఎలాంటి అడ్డంకులూ లేవు..
‘‘ఈ కీలక సైనిక సామగ్రిని విక్రయించడం వల్ల ప్రస్తుత, భవిష్యత్ ముప్పులను ఎదుర్కొనేలా భారత నౌకాదళం సామర్థ్యం విస్తరిస్తుంది. శత్రులక్ష్యాలను ముందస్తుగా గుర్తించి, విశ్లేషించుకొని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం చేకూరుతుంది. ఈ సామగ్రిని సైన్యంలో చేర్చుకునే విషయంలో భారత్‌కు ఎలాంటి అడ్డంకులూ లేవు. ఈ సామగ్రి వల్ల దక్షిణాసియా ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదు. ఈ సైనిక సామగ్రిని వర్జీనియాలోని హెర్న్ డాన్ ప్రాంతంలో ఉన్న హాక్ ఐ 360 కంపెనీ భారత్‌కు సప్లై చేయనుంది.

Read Also: Trump Warning : ఆ దేశాలకు ట్రంప్ వార్నింగ్

At the time of India- Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Pentagon OK for Rs. 11 thousand crore deal Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today US tensions..

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.