Assam declared foreigners : అస్సాం ప్రభుత్వం అక్రమ వలసలపై కఠిన చర్యలు చేపట్టింది. విదేశీయుల ట్రిబ్యునల్ ద్వారా “విదేశీయులు”గా ప్రకటించబడిన 15 మందిని 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని అస్సాం అధికారులు ఆదేశించారు. ఇందుకోసం ఇమిగ్రెంట్స్ (ఎక్స్‌పల్షన్ ఫ్రం అస్సాం) చట్టం, 1950ని ప్రయోగించారు.
ఈ 15 మందిలో ఆరుగురు మహిళలు ఉండగా, వీరంతా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్‌లో అక్రమంగా నివసిస్తున్నారని విదేశీయుల ట్రిబ్యునల్ తేల్చింది. పౌరసత్వాన్ని నిరూపించుకోలేని వారిని ‘డిక్లేర్డ్ ఫారినర్స్’గా పరిగణిస్తారు.
డిసెంబర్ 17న జారీ చేసిన ఉత్తర్వుల్లో, నాగావ్ జిల్లా కలెక్టర్ దేవాశిష్ శర్మ, ఈ 15 మందికి ఉత్తర్వులు అందిన 24 గంటల్లో అస్సాం, భారత్‌ను విడిచి వెళ్లాలని ఆదేశించారు. ధుబ్రి, శ్రీభూమి లేదా దక్షిణ సల్మారా–మంకాచర్ మార్గాల ద్వారా వెళ్లాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Read Also: IND vs SA: నేడే 5వ T20
ప్రస్తుతం ఆరుగురు గోల్‌పారా జిల్లాలోని మటియా ట్రాన్సిట్ క్యాంప్‌లో ఉండగా, మరో ఐదుగురు కోక్రాజార్ జిల్లాలోని 7వ అస్సాం పోలీస్ బెటాలియన్ (Assam declared foreigners) కేంద్రంలో ఉన్నారు. మిగిలిన నలుగురి వివరాలు అధికారిక ఉత్తర్వుల్లో పేర్కొనలేదని సమాచారం. వీరి డిపోర్టేషన్ ప్రక్రియను నాగావ్ పోలీసులు చేపట్టనున్నారు.
ఇటీవల అక్రమ వలసలపై అస్సాం ప్రభుత్వం దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ, అక్రమ వలసదారులను గుర్తించిన వెంటనే ట్రిబ్యునల్ జోక్యం లేకుండా డిపోర్ట్ చేస్తామని గతంలోనే ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా 1950 చట్టం ఇంకా చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేయడంతో, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది “డిక్లేర్డ్ ఫారినర్స్” కనిపించకుండా ఉన్నారని సీఎం పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: