పాకిస్థాన్(Pakistan)లో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తాయి. ఆ దేశ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్(Asim Munir) తిరుగుబాటు మొదలుపెట్టారు. ఏకంగా అధ్యక్ష పదవిపైనే కన్నేశారు. ప్రస్తుత అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ(Asif ali zardari)ని గద్దె దించేందుకు మునీర్ అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసీమ్ మునీర్ తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకోబోతున్నట్లు కూడా సమాచారం. ఇటీవల ఆయన ట్రంప్‌తో సమావేశం అయిన సంగతి తెలిసిందే.
అప్పటినుంచి పాకిస్థాన్‌లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఒకవేళ అసీమ్ మునీర్ దేశ అధ్యక్షుడైతే భారత్‌కు కష్టకాలం ఉంటుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మునీర్‌కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడి భారత్‌తో పాటు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ పహల్గాం ఉగ్రదాడికి కూడా అసీమ్ మునీరే కారణమని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ట్రంప్‌తో మునీర్ భేటీ తరువాత పెరిగిన ఉత్కంఠ
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అసీమ్ మునీర్ భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం పాకిస్థాన్‌లో రాజకీయ దిశలు మారిపోయినట్లు నిపుణుల అభిప్రాయాలు. అమెరికాతో సాన్నిహిత్యం పెంచుకునే ప్రయత్నం చేసేవిధంగా ఈ దౌత్యం పరిగణించబడుతోంది.
భారత్‌పై ప్రభావం – నిపుణుల హెచ్చరిక
అసీమ్ మునీర్ అధ్యక్షుడైతే, భారత్‌కి భద్రతాపరంగా గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశం. కశ్మీర్, ఉగ్రవాద, సరిహద్దు అంశాల్లో కఠిన వైఖరి చూపే అవకాశం ఉందని చెబుతున్నారు .
అసిమ్ మునీర్ చరిత్ర ఏమిటి?
1986లో మునీర్ పాకిస్తాన్‌లోని మంగ్లాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుండి పట్టభద్రుడయ్యాడు, అక్కడ తన బృందంలో అగ్ర క్యాడెట్‌గా ఉన్నందుకు అతనికి స్వోర్డ్ ఆఫ్ ఆనర్ లభించింది.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జీతం ఎంత?
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (COAS) అని కూడా పిలుస్తారు, అనేక నివేదికల ప్రకారం, నెలకు సుమారు 250,000 పాకిస్తానీ రూపాయలు (PKR) జీతం పొందుతారు. ఇది దాదాపు 75,000 భారతీయ రూపాయలకు సమానం.
Read hindi news: hindi.vaartha.com
Read Also:Texas: టెక్సాస్‌లో భారీ వరదలు: మృతుల సంఖ్య 100 దాటింది