📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Aasim-Imran: ఆసిమ్ మునీర్ కు పిచ్చెక్కింది..ఇమ్రాన్ ఖాన్

Author Icon By Vanipushpa
Updated: December 4, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) చనిపోయారంటూ వార్తలు ప్రచారం అయ్యాయి. కుటుంబ సభ్యులు సైతం ఆయన్ను కలవనివ్వడం లేదంటూ గోల పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ దేధశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. ఇమ్రాన్ ను జైల్లోనేచంపేశారనే అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆయన్ను కలిసింది. మా.ీ ప్రధాని క్షేమంగా నే ఉన్నారంటూ తెలిపారు. దీని తరువాత రోజు ఇమ్రాన్ కానే స్వయంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తాను ఉంటున్న అడియాలా జైలు నుంచే ఆయన దీన్ని పోస్ట్ చేశారు.

Read Also: Putin India Visit: పుతిన్‌ భారత్ పర్యటన

Aasim-Imran

ఉగ్రవాదానికి ఆజ్యం: ఇమ్రాన్

ఇమ్రాన్ ఖాన్ పెట్టిన పోస్ట్ లో ఆయన పాక్ ఫీల్డ్ మార్షల్ జనరల్ ఆసిమ్మునీర్ గురించి రాశారు. ఆసిమ్పిచ్చిపట్టు పట్టినట్టు వ్యవహరిస్తున్నారని అన్నారు. మునీర్ విధానాలు పాకిస్తాన్ కు వినాశకరమైనవని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్మీ చీఫ్ వల్లనే తమ దేశంలో ఉగ్రవాదం అదుపు తప్పిందని అన్నారు. అసింమునీర్ కు పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాల పట్ల ఎలాంటి ఆందోళన లేదు. కేవలం పాశ్చాత్య శక్తులను సంతోషపెట్టడానికే అతను ఇదంతా చేస్తున్నాడు. సొంత ప్రజలపై డ్రోన్ దాడులు మరియు సైనిక చర్యలను తాను వ్యతిరేకిస్తున్నానని, ఇది మరింత ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తుందని ఇమ్రాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆయన వల్లనే జైల్లో..

ఆసిమ్మునీర్ మొదట ఆఫ్ఘన్లను బెదిరించాడు, తరువాత పాకిస్తాన్ నుండి శరణార్థులను బహిష్కరించాడు. ఆ తరువాత డ్రోన్ దాడులు చేశాడు. దాని పరిణామాలను మనం ఇప్పుడు పెరుగుతున్న ఉగ్రవాదం రూపంలో ఎదుర్కొంటున్నాముఅని ఖాన్ అన్నారు. ఆసిమ్మునీర్ మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తని మాజీ ప్రధాని కామెంట్ చేశారు. అతని వలన పాకిస్తాన్‌లో రాజ్యాంగం, చట్ట పాలన పూర్తిగా పతనమైంది అని ఆరోపించారు. ఆర్మీ చీఫ్ వల్లనే తాను , తన భార్య జైల్లో ఉన్నామని…తను నాలుగు వారాల పాటూ ఏకాంత నిర్భంధంలో ఉంచారని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. బయటి ప్రపంచం నుంచి పూర్తిగా దూరం చేశారు. ఆఖరుకి జైల్లో సెంట్రీలతో కూడా మాట్లాడే అవకాశం లేదు. ప్రాథమిక అవసరాల కూడా మా నుంచి దూరం చేశారని ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాలున్నా తనను తన వారిని కలవనీయకుండా చేశారని ఆరోపించారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Asim Munir Breaking News in Telugu Google News in Telugu imran khan Latest In telugu news Latest political news Pakistan Politics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.