📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: మరో ముష్రాఫ్ కాబోతున్న మునీర్?

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌(Pakistan) మళ్లీ సైనిక పాలనలోకి వెళ్లనుందా? అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ(Asif ali Zardhari) , పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్(Asim Munir) మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాక్‌ సంక్షోభంలోకి వెళ్తుందనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. గతేడాది మార్చిలో రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన జర్దారీ, రాజ్యాంగ అధికారాలను చురుకుగా వినియోగించడాన్ని సైనిక వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయని ఆంగ్లపత్రిక ఒకటి తెలిపింది. ముఖ్యంగా సీనియర్ నియామకాలు, విదేశాంగ విధానం, కీలక పోస్టింగుల విషయంలో జర్దారీ సైనిక సూచనలను పట్టించుకోకుండా ముందుకెళ్తుండటం మునీర్‌తో విభేదాలు మరింత బలపడ్డాయి.

Pakistan: మరో ముష్రాఫ్ కాబోతున్న మునీర్!

సైనిక వర్గాల్లో అసంతృప్తిని పెంచినట్లు సమాచారం
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు బిలావల్ భుట్టో ఇటీవల భారత్‌కు హఫీజ్ సయీద్, మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులను అప్పగించాలనే వ్యాఖ్యలు పాక్ జిహాదీ వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. ఇది కూడా సైనిక వర్గాల్లో అసంతృప్తిని పెంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సైనిక తిరుగుబాటుకు మునీర్ సిద్ధమయ్యారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. గతంలోనూ పాక్‌‌లో సైన్యం అధికారాన్ని హస్తగతాన్ని చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ మూడుసార్లు 1958, 1977, 1999 సంవత్సరాల్లో ప్రజా ప్రభుత్వాలపై సైన్యం తిరుగుబాటు చేసింది. 1999లో జనరల్ పర్వేజ్ ముషరఫ్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను తొలగించారు. అంతకు ముందు 1977లో జనరల్ జియా ఉల్ హక్ ప్రధానమంత్రి జుల్ఫికర్ భుట్టో (జర్దారీ మామ) ప్రభుత్వాన్ని కూల్చారు. ఇక, 2022లో సైన్యాధిపతిగా నియమితుడైన మునీర్‌కు గూఢచారి సంస్థ (ISI), సైన్యం ఇంటెలిజెన్స్‌లో అనుభవం ఉంది. ఆయనను అత్యంత కర్కోటకుడిగా పరిగణిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ భేటీ అయ్యినప్పటికీ, ఆయన విదేశీ సంబంధాలను ప్రధానంగా ఆర్మీ ఆధిపత్యానికి అనుగుణంగా మలుచుకుంటున్నారని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

జజర్డరీతో బలవంతంగా రాజీనామా ఆలోచనలో సైన్యం
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ- అధ్యక్షుడైన అసిఫ్ జర్దారీ సంకీర్ణ ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా రెండోసారి అధ్యక్షుడయ్యారు. తాను చట్టబద్ధంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానని స్పష్టం చేస్తూ.. సైనిక ఒత్తిళ్లకు తలొగ్గకుండా కొన్ని ఆదేశాలను అడ్డుకుంటున్నారు. ఇది సైన్యానికి అసహనం కలిగిస్తోంది. సైనిక వర్గాలు ఆయనను మేనేజ్ చేయలేని వ్యక్తిగా చూస్తున్నట్టు సంకేతాలిస్తున్నాయి. ఓ మీడియా నివేదిక ప్రకారం.. జర్డరీతో బలవంతంగా రాజీనామా చేయించడం లేదా మరొకరు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేలా అధికార మార్పిడి ఆలోచనలో సైన్యం ఉంది.
ప్రస్తుతం సైనిక తిరుగుబాటుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, పాక్‌ గత దశాబ్దాల్లో పాలకులపై సైన్యం ఒత్తిడి తెచ్చి, రాజీనామాలు చేయించడంలో నైపుణ్యం కనబర్చింది. కొందరు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈసారి కూడా ఎటువంటి హంగామా లేకుండానే జర్దారీ తొలగింపునే లక్ష్యంగా ఒక గేమ్ ప్లాన్ నడుస్తోంది. .

జనరల్ అసిమ్ మునీర్ విద్య ఏమిటి?
అసిమ్ మునీర్ | జీవిత చరిత్ర, ఆర్మీ చీఫ్, పాకిస్తాన్, భారతదేశం ...
అతను ఇస్లామాబాద్‌లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీని పొందాడు.
పాకిస్తాన్‌లో ఆర్మీ చీఫ్ జీతం ఎంత?
మరోవైపు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నెలకు దాదాపు PKR 2,50,000 అంటే భారత రూపాయలలో దాదాపు ₹ 75,000 జీతం పొందుతారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:Nitin Gadkari: ఢిల్లీకి వచ్చాక వెంటనే వెళ్ళిపోవాలని అనిపిస్తుంది

#telugu News Asim Munir Pakistan army Pakistan Politics Pervez Musharraf

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.