పాకిస్థాన్ మరియు ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) మధ్య రాజీ కుదరడం లేదు. తాజాగా, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) ప్రకటించారు. ఇస్తాంబుల్‌లో జరిగిన తాజా రౌండ్ చర్చలు రెండు రోజుల పాటు కొనసాగుతాయని భావించినప్పటికీ, ఆఫ్ఘన్ తాలిబన్ ప్రతినిధి బృందం ఎటువంటి వ్రాతపూర్వక ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించడంతో, చర్చలు అర్థాంతరంగా ముగిశాయి.
Read Also: TG Weather: వణికిస్తున్న చలి.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
పాక్ రక్షణ మంత్రి యుద్ధ హెచ్చరిక
అంతకుముందు, ఈ శాంతి చర్చలకు కొన్ని గంటల ముందు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే, బహిరంగ యుద్ధం తప్పదంటూ ఆయన వ్యాఖ్యానించారు. సరిహద్దుల్లో దాడులు కొనసాగితే, తమ నుంచి ప్రతిస్పందన దారుణంగా ఉంటుందని ఖవాజా హెచ్చరించారు. శత్రువులు తమను ఎలా లక్ష్యంగా చేసుకుంటారనే దాన్ని బట్టి, తమ ప్రతిస్పందన కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
చర్చలు విఫలం కావడానికి కారణాలు
తాజాగా జరిగిన చర్చల్లో సరిహద్దు ఘర్షణలు, డ్రోన్ దాడులు, పాకిస్థాన్ వాణిజ్య క్రాసింగ్‌లను మూసివేయడం వంటి అంశాలపై రెండు దేశాలు ఒక అంగీకారానికి రాలేకపోయాయి. కాబూల్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, సరిహద్దు దాడులను చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అందుకే డ్రోన్ దాడులు చేపట్టామని సమర్థించుకుంటోంది. ఆఫ్ఘనిస్థాన్ మాత్రం ఈ ఆరోపణలను తిప్పికొడుతోంది. శాంతి చర్చలు విఫలం అవ్వడంతో, మళ్లీ సరిహద్దుల్లో భారీ దాడులు జరగవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: