ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్-4 దశలో భాగంగా జరుగుతున్న పాకిస్థాన్ – శ్రీలంక మ్యాచ్‌లో మొదటి కీలక నిర్ణయం పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Captain Salman Ali Agha) నే తీసుకున్నారు. టాస్ గెలిచిన వెంటనే ఆయన బౌలింగ్ ఎంచుకోవడం గమనార్హం. ఈ నిర్ణయానికి కారణం పిచ్ పరిస్థితులేనని ఆయన వెల్లడించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా ఇలా అన్నారు.
‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదని అనుకుంటున్నా. భారత్‌తో మ్యాచ్‌లో మేం శుభారంభం అందుకున్నాం. కానీ ఆ తర్వాత టెంపో మారిపోయింది. భారత్‌తో పాటు మాది మంచి జట్టే. మేం గతం గురించి ఆలోచించం.ఈ రోజు మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ పెడ్తాం. మా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.’అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.
టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని
మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక (Sri Lanka captain Charith Asalanka) తెలిపాడు. అయితే ఈ పిచ్ బాగా కనిపిస్తోందని, ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. ‘మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి.మెరుగ్గా బ్యాటింగ్ చేయడంతో పాటు చివరి ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేయాలి. తుది జట్టులో రెండు మార్పులు చేశాడు.
తీక్షణ, కరుణరత్నే జట్టులోకి వచ్చారు. మాకు ఒక అదనపు బౌలర్ కావాలని భావించాం. అందుకే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన బౌలర్‌ను తీసుకున్నాం.’అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.సూపర్-4 (Super-4) పోరులో చెరో మ్యాచ్ ఓడిన పాకిస్థాన్, శ్రీలంకకు ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.
ఫైనల్ జట్లు
శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషారపాకిస్థాన్ : సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహమ్మద్ హారిస్ (కీపర్), మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.
Read hindi news: hindi.vaartha.com
Read Also: