📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Asia Cup 2025 – యూఏఈపై పాక్ గెలుపు

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 9:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025  (Asia Cup 2025) సూపర్ ఫోర్ దశకు పాకిస్థాన్ జట్టు చివరికి అడుగుపెట్టింది. అయితే ఈ అర్హత సాధన వారికి ఏ మాత్రం ఈజీగా దొరకలేదు. ఆతిథ్య యూఏఈ (UAE) జట్టుతో బుధవారం దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో గట్టి పోటీ తర్వాతే పాకిస్థాన్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాక్ జట్టు మరోసారి టోర్నీ ఫేవరెట్‌గా నిలిచింది.

మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు ఆరంభంలోనే కష్టాల్లో పడింది. యూఏఈ బౌలర్ జునైద్ సిద్ధిఖీ (Junaid Siddiqui) ఆరంభ ఓవర్లలోనే వేగం, స్వింగ్‌తో పాక్ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. మొదటి మూడు ఓవర్లలోనే పాకిస్థాన్ కీలక వికెట్లు కోల్పోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ దశలో జట్టును ఆదుకునేందుకు వన్‌డౌన్‌లో క్రీజ్‌లోకి వచ్చిన ఫకర్ జమాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

కెప్టెన్ సల్మాన్ అలీ అఘాతో కలిసి

దూకుడు, సంయమనం కలగలిపిన అతని బ్యాటింగ్ పాక్ ఇన్నింగ్స్‌కు పునరుజ్జీవం ఇచ్చింది. కేవలం 36 బంతుల్లోనే రెండు బౌండరీలు, మూడు భారీ సిక్సర్లతో ఫిఫ్టీ సాధించి జట్టును నిలదొక్కుకున్నాడు. కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Captain Salman Ali Agha) తో కలిసి మూడో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి స్కోరును స్థిరం చేశాడు. ఈ భాగస్వామ్యమే పాకిస్థాన్ ఇన్నింగ్స్‌కు బలం చేకూర్చింది.

Asia Cup 2025

అయితే, కెప్టెన్ ఔటైన తర్వాత పాక్ మళ్లీ తడబడింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. యూఏఈ బౌలర్లు జునైద్ సిద్ధిఖీ (4/18), సిమ్రన్‌జీత్ సింగ్ (3/26) ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియ‌న్‌కు క్యూ కట్టారు. అయితే, చివర్లో షాహీన్ షా అఫ్రిది మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ స్కోరు చేయగలిగింది. కేవలం 14 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 29 పరుగులు చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

షాహీన్ షా అఫ్రిది మెరుపులు మెరిపించడంతో

అయితే, కెప్టెన్ ఔటైన తర్వాత పాక్ మళ్లీ తడబడింది. మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. యూఏఈ బౌలర్లు జునైద్ సిద్ధిఖీ (4/18), సిమ్రన్‌జీత్ సింగ్ (3/26) ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియ‌న్‌కు క్యూ కట్టారు. అయితే, చివర్లో షాహీన్ షా అఫ్రిది (Shaheen Shah Afridi) మెరుపులు మెరిపించడంతో పాకిస్థాన్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కేవలం 14 బంతుల్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో అజేయంగా 29 పరుగులు చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dhanashree-verma-what-benefit-do-you-get-from-talking-negatively-about-me/sports/549331/

Asia Cup 2025 Breaking News Dubai International Stadium Fakhar Zaman fifty latest news Pakistan Cricket Team Shaheen Shah Afridi all round performance Telugu News UAE cricket team

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.