📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Asia Cup 2025 – Indi vs Pak మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 8:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (2025 Asia Cup) టోర్నీలో భాగంగా, కొన్ని గంటల్లో దుబాయ్ వేదికలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్, రెండు దేశాల అభిమానుల గుండెల్లోని ఆత్రుతను మరింత పెంచుతోంది.భారత్-పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్‌‌కురంగం సిద్దమైంది. దుబాయ్ (Dubai) వేదికగా ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఈ దాయాదీ దేశాలు అమీతుమీ తేల్చుకోనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ పోరును క్రికెట్ మ్యాచ్‌లా కాకుండా ఓ యుద్దంలా ఇరు దేశాల అభిమానులు భావిస్తున్నారు. అభిమానుల భావోద్వేగాలతో ఈ మ్యాచ్ ముడిపడి ఉండటంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. ఇప్పటికే లీగ్‌ (League) లో భారత్, పాక్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి ఉత్సాహంగా ఉన్నాయి. ఆతిథ్య యూఏఈపై 9 వికెట్ల తేడాతో భారత్, ఒమన్‌పై పాకిస్థాన్ 93 పరుగుల తేడాతో విజయం సాధించాయి. గ్రూప్-ఏలో టాపర్‌గా నిలవాలంటే ఈ పోరులో గెలవడం ఇరు జట్లకు కీలకం.

పాక్‌లో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు.

గత చరిత్ర చూసుకున్నా.. ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్నా టీమిండియా (Team India) నే హాట్ ఫేవరేట్‌గా కనిపిస్తోంది. టీ20ల్లో టీమిండియా వరల్డ్ ఛాంపియన్‌గా ఉండగా.. పాకిస్థాన్ 8వ స్థానంలో ఉంది. అంతేకాకుండా పాక్‌లో సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేరు. ఆ జట్టు పూర్తిగా కుర్రాళ్లతో ఉంది. మరోవైపు భారత్.. వరల్డ్ బెస్ట్ టీ20 ప్లేయర్లతో భీకరంగా కనిపిస్తోంది. అయితే టీ20 ఫార్మాట్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. అంతేకాకుండా భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒత్తిడితో కూడిన పోరు.

Asia Cup 2025

ఎవరు ఈ ఒత్తిడిని అధిగమిస్తే ఆ జట్టునే విజయం వరిస్తుంది.రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ సోనీ టీవీ నెట్‌‌వర్క్ ఛానెల్స్‌ (Sony TV Network Channels) లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ స్పోర్ట్స్1, 2, 3, 4 ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన సోనీ లివ్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే భారత్, పాక్ మ్యాచ్‌ను ఫ్రీగా చూసే అవకాశం లేదు. జియో టీవీలో ఫ్రీగా చూద్దామనుకున్నా..ఆ యాప్‌ను కూడా సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లోకి మార్చేసారు. భారత ప్రభుత్వానికి చెందిన డీడీ స్పోర్ట్స్‌లో కూడా ఈ మ్యాచ్ రాదు.

ఎక్కడ చూడొచ్చంటే?

సోనీ టీవీ ఛానెల్‌‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవడం లేదా సోనీ లీవ్ యాప్‌ సబ్‌స్క్రిప్షన్ (Sony LIVE app subscription) తీసుకోని మ్యాచ్ చూడాల్సిందే.ఆసియా కప్ , టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్.. ఏదీ తీసుకున్నా పాక్‌పై భారత్‌దే పై చేయి. ముఖ్యంగా ఆసియా కప్‌లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం. 1984లో ఈ టోర్నీ మొదలవ్వగా..ఇప్పటి వరకు 16 ఎడిషన్స్ జరిగాయి. ఇందులో భారత్, పాకిస్థాన్ 15 ఎడిషన్స్ ఆడాయి.

అత్యధికంగా భారత్ 8 సార్లు విజేతగా నిలిస్తే పాకిస్థాన్ కేవలం రెండు సార్లు మాత్రమే గెలుపొందింది. శ్రీలంక 6 సార్లు గెలిచింది. భారత్, పాకిస్థాన్ ఆడిన 15 ఎడిషన్లలో ఇరు జట్లు ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడలేదు.ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య 18 మ్యాచ్‌లు జరగ్గా.. భారత్ 10 గెలిచింది. పాకిస్థాన్ 6 గెలవగా.. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. టీ20 ఫార్మాట్‌లో 3 సార్లు తలపడగా.. భారత్ రెండు సార్లు గెలిచింది. పాకిస్థాన్ ఒకే ఒక్కసారి గెలుపొందింది. ఈ రికార్డులే టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత ఐదేళ్లలో భారత్, పాక్ టీ20ల్లో ఐదు సార్లు తలపడగా భారత్ 3-2తో ఆధిక్యంలో ఉంది.

Read hindi news: epaper.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-sri-lanka-win-the-toss-and-elect-to-bowl/international/546804/

Asia Cup 2025 Breaking News Cricket Rivalry Dubai venue high-voltage match India vs Pakistan latest news Operation Sindoor Pahalgam Attack Telugu News tense political scenario

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.