📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Asia Cup 2025 – IND vs PAK మ్యాచ్‌.. మ్యాచ్ రిఫ‌రీగా ఎవరంటే?

Author Icon By Anusha
Updated: September 20, 2025 • 6:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో సూపర్ ఫోర్ దశలో భాగంగా సెప్టెంబర్ 21న జరిగే అత్యంత ప్రతీక్షితమైన మ్యాచ్ భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతోంది.పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ గత మ్యాచ్‌లో జరిగిన ఒక వివాదంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మ్యాచ్ రిఫరీని మార్చాలని ఐసీసీని కోరింది. అయితే, ఐసీసీ పాకిస్తాన్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఆసియా కప్ 2025లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల తర్వాత ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 దశకు చేరుకున్నాయి.

ఈ దశలో భాగంగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా, సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) నాయకత్వంలోని పాకిస్తాన్‌తో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనుంది. ఈ హై-ప్రొఫైల్ మ్యాచ్‌కు ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరించనున్నారు. అయితే, అతని నియామకంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తం చేసింది.వాస్త‌వానికి ఆదివారం మ్యాచ్‌కు చెందిన మ్యాచ్ అఫీషియ‌ల్స్ పేర్ల‌ను ఇంకా ప‌బ్లిక్‌గా ప్ర‌క‌టించ‌లేదు.

Asia Cup 2025

మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అడ్డుకున్నారని

ఈ టోర్నీలో విండీస్ మాజీ ప్లేయ‌ర్ రిచీ రిచ‌ర్డ్‌స‌న్ (Richie Richardson) కూడా మ్యాచ్ రిఫ‌రీగా ఉన్నారు.సెప్టెంబర్ 14న ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్‌లు హ్యాండ్‌షేక్ చేసుకోకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ అడ్డుకున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. దీనిపై పాక్ అధికారికంగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. పైక్రాఫ్ట్ ప్రవర్తన కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధంగా ఉందని, అతనిపై విచారణ జరిపి, మ్యాచ్ రిఫరీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.ఐసీసీకి రెండు సార్లు పాక్ క్రికెట్ బోర్డు లేఖ కూడా రాసింది.

తాము ఆడే మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను తొల‌గించాల‌ని కూడా డిమాండ్ చేసింది. అయితే ఆ రెండు డిమాండ్ల‌ను ఐసీసీ (ICC) తిర‌స్క‌రించింది. ఎలైట్ ప్యానెల్ రిఫ‌రీల‌కు అండ‌గా ఐసీసీ నిలిచింది.పైక్రాఫ్ట్ విష‌యంలో పాకిస్థాన్ అసంతృప్తితో ఉన్నా.. ఐసీసీ మాత్రం ఆ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌ను తొల‌గించేందుకు సుముఖంగా లేదు. దీంతో రెండోసారి కూడా ఆయ‌నే రిఫ‌రీగా చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/axar-patel-fielding-coach-gives-update-on-axars-health/sports/551114/

Andy Pycroft asia cup super four Breaking News elite panel India vs Pakistan indopak match latest news match referee officials selection September 21 Telugu News west indies former player

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.