ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నీలో క్రికెట్ అభిమానులందరూ ఎక్కువగా ఎదురుచూస్తున్న పోరాటం భారత్-పాకిస్థాన్ మ్యాచ్. ప్రతి సారి ఈ రెండు జట్లు మైదానంలో తలపడితే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. (రేపు) ఆదివారం జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ (High voltage match) కు
సంబంధించి ఇప్పటికే ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇలాంటి సందర్భంలో టీమిండియా (Team India) మాజీ కెప్టెన్, లెజెండరీ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.గవాస్కర్ అభిప్రాయంలో, పాకిస్థాన్‌పై విజయం సాధించాలంటే భారత్ టాప్ ఆర్డర్ దాడి బలంగా ఉండాల్సిందే.
అభిషేక్ అయితే తన అగ్రెసివ్ షాట్లతో
ముఖ్యంగా యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ (Abhishek Sharma) లు జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇవ్వగలరని ఆయన ధీమాగా చెప్పారు. “ఈ ఇద్దరు ఆటగాళ్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడితే భారత్ స్కోరు పెద్దది అవుతుంది. గిల్ తన టెక్నిక్, క్రమశిక్షణతో బౌలర్లను ఒత్తిడిలో పెడతాడు.
అభిషేక్ అయితే తన అగ్రెసివ్ షాట్లతో పవర్‌ప్లే (Powerplay) లోనే స్కోరును రెట్టింపు చేసే సామర్థ్యం ఉన్న ఆటగాడు” అని గవాస్కర్ అన్నారు.వారిద్దరూ పాకిస్థాన్ బౌలింగ్ దాడిని సమర్థంగా ఎదుర్కొని, జట్టుకు బలమైన పునాది వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.
యువ బ్యాటర్లు
ఒకవేళ ఈ యువ బ్యాటర్లు తొందరగా ఔటైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గవాస్కర్ అన్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లు (The players) బాధ్యత తీసుకుని, భారత్‌కు విజయాన్ని అందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఏ రకంగా చూసినా ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టోర్నమెంట్ ప్రారంభం నుంచే ఇరు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: