📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Asia Cup 2025 – హాంగ్ కాంగ్ పై బంగ్లాదేశ్ ఘన విజయం

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 9:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సూపర్ టోర్నీలో బంగ్లాదేశ్ తన మొదటి మ్యాచ్‌లోనే ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన పోరులో హాంగ్‌కాంగ్‌ (Hong Kong) పై 8 వికెట్ల తేడాతో గెలిచి శుభారంభాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో బంగ్లాదేశ్ జట్టు టోర్నీకి మంచి ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా కెప్టెన్ లిటన్ దాస్ ఆకట్టుకునే బ్యాటింగ్ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ముందుగా టాస్ కోల్పోయిన హాంగ్‌కాంగ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. బంగ్లాదేశ్ (Bangladesh) బౌలర్లకు ఎదురీదేందుకు ప్రయత్నించినప్పటికీ వారు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితమయ్యారు. కెప్టెన్ యసిమ్ ముర్తాజా కొంత ప్రతిఘటన కనబరిచాడు. కేవలం 19 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టుకు ఊరటనిచ్చాడు. ఇందులో రెండు సిక్సులు, రెండు బౌండరీలు ఉన్నాయి.

ప్రతి ఒక్కరూ రెండు వికెట్లు తీసి

ఓపెనర్ జీషన్ అలీ కూడా కొంతసేపు క్రీజులో నిలిచి 34 బంతుల్లో 30 పరుగులు చేశాడు. నిజకత్ ఖాన్ మాత్రం మరింత సమర్థవంతంగా ఆడి 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్ అహ్మద్, తంజీమ్ హసన్ షకీబ్, రిషద్ హొస్సేన్ అద్భుతంగా రాణించారు. వీరిలో ప్రతి ఒక్కరూ రెండు వికెట్లు (Two wickets)తీసి హాంగ్‌కాంగ్ రన్‌ఫ్లోను అడ్డుకున్నారు. చివర్లో హాంగ్‌కాంగ్ బౌండరీలు కొట్టే ప్రయత్నం చేసినా, బంగ్లాదేశ్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్, లెంగ్త్‌తో వారిని కట్టడి చేశారు.

Asia Cup 2025

అనంతరం బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 3 వికెట్లకు 144 పరుగులు చేసి గెలుపొందింది. లిటన్‌దాస్‌కు తోడుగా టౌహిడ్ హృదయ్(36 బంతుల్లో ఫోర్‌తో 35 నాటౌట్) రాణించాడు. హాంగ్ కాంగ్ బౌలర్లలో అయుష్ శుక్లా, అతీక్ ఇక్బాల్ చెరో వికెట్ తీసారు. లక్ష్యచేధనలో బంగ్లాదేశ్ ఓపెనర్లు పర్వేజ్ హోస్సేన్(19), తంజిద్ హసన్(14) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ లిటన్ దాస్, టౌహిడ్ హృదయ్ ఆచితూచి ఆడారు.

టౌహిడ్ హృదయ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు

44 బంతుల్లో లిటన్ దాస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.విజయం ముంగిట లిటన్ దాస్ క్లీన్ బౌల్డ్ కావడంతో మూడో వికెట్‌కు నమోదైన 95 పరుగుల భాగస్వామ్యానిక తెరపడింది. జాకెర్ అలీ(0 నాటౌట్)తో కలిసి టౌహిడ్ హృదయ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన హాంగ్ కాంగ్.. సూపర్-4 రేసు నుంచి తప్పుకుంది. ఆ జట్టు శ్రీలంకతో ఆఖరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అద్భుతం జరిగితే తప్పా హాంగ్ కాంగ్ ముందడుగు వేసే అవకాశం లేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/icc-in-the-odi-world-cup-all-are-women-icc/international/545550/

Asia Cup 2025 Bangladesh victory Bangladesh vs Hong Kong Breaking News Hong Kong batting latest news Liton Das half century Telugu News Yasim Murtaza Zeeshan Ali

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.