📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Latest News: Asia Cup 2025 – అఫ్గానిస్థాన్‌ పై బంగ్లాదేశ్‌ ఘన విజయం

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 9:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్‌ 2025లో బంగ్లాదేశ్‌ జట్టు (Bangladesh team) మరోసారి తన పోరాట స్పూర్తిని చాటుకుంది. అఫ్గానిస్తాన్‌ (Afghanistan) తో మంగళవారం జరిగిన డూ–ఆర్–డై మ్యాచ్‌లో బంగ్లా జట్టు సమష్టిగా రాణించి 8 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయం వల్ల సూపర్–4 దశకు చేరుకునే అవకాశాలను సజీవంగా ఉంచుకోవడమే కాకుండా, జట్టు మానసిక స్థితిని కూడా బలపరిచింది. టోర్నీలో ఇప్పటి వరకు బంగ్లాదేశ్‌ ప్రదర్శన ఊహించినంత బలంగా లేకపోవడంతో ఈ మ్యాచ్‌లో గెలవడం అత్యంత అవసరం అయ్యింది.

అలాంటి సున్నిత సమయంలో ఆటగాళ్లు సమష్టిగా జట్టు కోసం ఆడారు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ తంజిద్ హసన్(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించగా..సైఫ్ హసన్(28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30), టౌహిడ్ హృదయ్(20 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26) విలువైన పరుగులు చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్(2/26), నూర్ అహ్మద్(2/23) రెండేసి వికెట్లు తీయగా..అజ్మతుల్లా ఒమర్జాయ్ ఒక వికెట్ పడగొట్టాడు.

శ్రీలంక టాప్‌లో ఉండగా

అనంతరం అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రెహ్మనుల్లా గుర్బాజ్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35), అజ్మతుల్లా ఒమర్జాయ్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 30), రషీద్ ఖాన్(11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rahman)(3/28) మూడు వికెట్లు తీయగా.. నాసుమ్ అహ్మద్, టస్కిన్ అహ్మద్, రిషద్ హొస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

Asia Cup 2025

చివరి 2 ఓవర్లలో అఫ్గాన్ విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో రషీద్ ఖాన్ ఉండటంతో లక్ష్యాన్ని చేధిస్తుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే ముస్తాఫిజుర్ వేసిన 19వ ఓవర్‌లో తొలి బంతినే రషీద్ ఖాన్ (Rashid Khan) బౌండరీ బాదాడు. కానీ ఆ మరుసటి బంతికే అతను క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇదే అఫ్గాన్ కొంపముంచింది. రషీద్ ఖాన్ ఔటవ్వకపోయి ఉంటే ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ గెలిచేది. ఆ మరుసటి బంతికే మరో బ్యాటర్‌ను ఔట్ చేసిన ముస్తాఫిజుర్.. తర్వాతి మూడు బంతుల్లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో ఈ ఓవర్‌లో 5 పరుగులే వచ్చాయి.

బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉండగా

ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు అవసరం కాగా.. నూర్ అహ్మద్ రెండు సిక్స్‌లు బాది ఔటయ్యాడు.బంగ్లాదేశ్ విజయంతో గ్రూప్-బీ (Group-B) సూపర్-4 రేసు సంక్లిష్టంగా మారింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన శ్రీలంక టాప్‌లో ఉండగా.. ఒక మ్యాచ్ ఓడి రెండు గెలిచిన బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ఒకటి గెలిచి, మరొకటి ఓడిన బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉండగా.. హాంగ్ కాంగ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంకతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ మెరుగైన రన్‌రేట్‌తో గెలిస్తే టోర్నీలో ముందడుగు వేస్తోంది. ఓడితే మాత్రం ఇంటిదారి పడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pacer-found-positive-in-dope-test-banned-for-a-few-months/sports/548609/

8 runs victory afghanistan vs bangladesh Asia Cup 2025 Bangladesh win Breaking News do or die match latest news mustafizur rahman 3/28 super 4 chances Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.