Latest News: Asia Cup 2025 – టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Read Time:  1 min
Asia Cup 2025
Asia Cup 2025
FONT SIZE
GET APP

ఆసియా కప్ 2025 (2025 Asia Cup)లో సూపర్ 4 దశ ప్రారంభమైంది. ఈ దశలోని తొలి పోరులో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో తలపడుతోంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు జరిగిన టాస్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ (Captain Liton Das) అదృష్టవశాత్తూ గెలిచి, బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. గత కొన్ని మ్యాచ్‌లలో రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయం సాధించటం, పిచ్ ప్రవర్తనపై స్పష్టత లేకపోవటం వంటి కారణాల వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.

‘మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ టోర్నీ తొలి దశలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లే విజయాలు సాధించాయి. అంతేకాకుండా ఈ పిచ్ ఎలా ఉంటుందో మాకు ఖచ్చితంగా తెలియదు. ఈ మ్యాచ్ ఆడటానికి మేం ఉత్సాహంగా ఉన్నాం. తుది జట్టులో రెండు మార్పులు చేశాం. సోహన్, రిషాద్ ఆడటం లేదు.మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు.

Asia Cup 2025
Asia Cup 2025

చాలా మంది యువ ఆటగాళ్లు

ఇది ఇప్పటికే ఉపయోగించిన పిచ్ (pitch) అని, ముందుగా బౌలింగ్ చేయడం మంచి ఆప్షన్ అని అభిప్రాయపడ్డాడు. 2021 నుంచి చాలా మంది యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారని, పరిణతి చెందుతున్నారని తెలిపాడు. తాము ఎలాంటి మార్పులు చేయలేదని, విన్నింగ్ కాంబినేషన్‌ (Winning combination) తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

శ్రీలంక :పాతుమ్ నిస్సంక, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్), కమీల్ మిశారా, కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమీందు మెండిస్, వనిందు హసరంగ, దునిత్ వెల్లాలగే, దుష్మంత చమీర, నువాన్ తుషార.బంగ్లాదేశ్ :సైఫ్ హసన్, తంజీద్ హసన్ తమీమ్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్/కెప్టెన్), తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, జాకర్ అలీ, మహేది హసన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లామ్, ముస్తఫిజుర్ రహమాన్.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/asia-cup-2025-ind-vs-pak-match-who-will-be-the-match-referee/international/551142/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.