Latest News: Asia Cup 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

Read Time:  1 min
Asia Cup 2025
Asia Cup 2025
FONT SIZE
GET APP

ఆసియా కప్ 2025  (Asia Cup 2025)టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగే కీలక క్రికెట్ మ్యాచ్ ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని సవాలు ఎదురైంది. రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ ప్రాక్టీస్ సేసన్లో గాయపడి మైదానానికి దూరమయ్యాడు. ఈ పరిస్థితిలో జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, వికెట్ కీపర్ జాకర్ అలీ తాత్కాలికంగా కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. ఈ పరిణామం బంగ్లాదేశ్ జట్టులోని ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

టాస్ గెలిచిన జాకర్ అలీ (Jackar Ali) ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుని, టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్ ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రాక్టీస్ సమయంలో లిటన్ గాయపడ్డాడు. అతను త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నాము. కెప్టెన్‌గా వ్యవహరించడం నా కోసం గొప్ప అనుభవం. ఒక జట్టుగా మేము మంచి ప్రదర్శన చేస్తున్నారు. మా బలాలను ఉపయోగించి అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి ప్రయత్నిస్తాము” అని చెప్పారు.

బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్

ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నామని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Team India captain Suryakumar Yadav) తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

Asia Cup 2025
Asia Cup 2025

‘మేం ముందుగా బ్యాటింగ్ చేసేందుకు సిద్దంగా ఉన్నాం. గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం ఆశించిన ఫలితాలు దక్కాయి. అందుకే ముందుగా బ్యాటింగ్ (Batting) చేసేందుకు సంతోషంగా ఉన్నాం. గత మ్యాచ్‌ల తరహాలోనే మేం రాణించాల్సిన అవసరం ఉంది. మెరుగైన ప్రదర్శన చేస్తే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. మా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు.

వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది

క్యాచ్‌లు నేలపాలు చేయడం ఆటలో భాగం. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. జట్టులో ఎలాంటి మార్పులు లేవు.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.సూపర్-4 భారత్, బంగ్లాదేశ్ ఇప్పటికే చెరొక మ్యాచ్ గెలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్త్ దక్కనుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారత్ ఆడిన నాలుగు మ్యాచ్‌లకు నాలుగు గెలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.