📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Asia Cup 2025 – చరిత్ర సృష్టించిన అఫ్గాన్ స్టార్ స్పిన్నర్

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 12:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) టోర్నమెంట్‌లో అఫ్గానిస్తాన్ జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయినా, అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Afghan star spinner Rashid Khan) మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడంతో, రషీద్ ఖాన్ టి20 ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. ఈ రికార్డును ఇంతకు ముందే భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) కలిగివుండే అవకాశం ఉన్నప్పటికీ, రషీద్ ఖాన్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఈ చరిత్ర సృష్టించాడు.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ (International T20 cricket) లో ఇప్పటికే అత్యధికంగా 173 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్.. టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కూడా అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. బౌలర్‌గా ఉన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ (Bangladesh) తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ 2 వికెట్లతో రషీద్ ఖాన్ టీ20 ఆసియా కప్‌లో తన వికెట్ల సంఖ్యను 14కి పెంచుకున్నాడు.

భువీని అధిగమించాడు

భువనేశ్వర్ కుమార్ 6 మ్యాచుల్లో 13 వికెట్లతో ఈ రికార్డును తన పేరిట ఉంచుకోగా.. రషీద్ ఖాన్ 10 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకుని భువీని అధిగమించాడు.*రషీద్ ఖాన్: 14 వికెట్లు (అఫ్గానిస్తాన్)

*భువనేశ్వర్ కుమార్: 13 వికెట్లు (భారత్)

*అమజద్ జావెద్: 12 వికెట్లు (యూఏఈ)

*వనిందు హసరంగ: 12 వికెట్లు (శ్రీలంక)

*హార్దిక్ పాండ్యా (Hardik Pandya): 12 వికెట్లు (భారత్)

Asia Cup 2025

రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది

ఆసియా కప్ 2025లో అఫ్గానిస్తాన్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టు (Hong Kong team) ను ఓడించి శుభారంభం చేసింది. కానీ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం గ్రూప్-బీలో బంగ్లాదేశ్ మూడు మ్యాచుల్లో 4 పాయింట్లతో, శ్రీలంక రెండు మ్యాచుల్లో 4 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి.

ఆఫ్గానిస్తాన్ రెండు మ్యాచుల్లో 2 పాయింట్లతో ఉంది. అఫ్గానిస్తాన్ మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగి ఉండటంతో తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) ను ఓడిస్తే నేరుగా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓడిపోతే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/neeraj-chopra-where-to-watch-neeraj-chopras-match-at-the-world-athletics-championships-today/international/548823/

Afghan star spinner Afghanistan team loss Afghanistan vs Bangladesh match Asia Cup 2025 Breaking News latest news rare record Rashid Khan Telugu News two wickets

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.