📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Ravichandran Ashwin: బిగ్ బాష్ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌తో అశ్విన్ ఒప్పందం?

Author Icon By Anusha
Updated: September 24, 2025 • 9:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత క్రికెట్‌ జట్టుకు అనేక విజయాలు అందించిన మాజీ స్టార్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఇప్పుడు ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL)లో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటి వరకు ఊహాగానాలుగా మాత్రమే వచ్చిన వార్తలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్పోర్ట్స్‌ మీడియా సంస్థ ‘ఫాక్స్‌ స్పోర్ట్స్‌’ తాజా కథనం ప్రకారం, అశ్విన్‌ సిడ్నీ థండర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం లభించింది. దీనిపై అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశముందని ఆ కథనంలో పేర్కొంది.

సిడ్నీ థండర్ ఇప్పటికే న్యూజిలాండ్ పేసర్ లాకీ ఫెర్గ్యూసన్ (Lockie Ferguson,), పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షదాబ్ ఖాన్ లాంటి కీలక ఆటగాళ్లను డ్రాఫ్ట్‌లో దక్కించుకుంది. అలాగే ఇంగ్లండ్ వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ (Sam Billings) ఇప్పటికే మల్టీ ఇయర్ డీల్‌తో జట్టుకు అంకితం అయ్యాడు. ఈ జాబితాలో ఇప్పుడు అశ్విన్ చేరడం థండర్‌కు మరో బలాన్ని చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అశ్విన్ గత సంవత్సరం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఐఎల్‌టీ20లో ఆడుతున్న అశ్విన్

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బర్గ్ వ్యక్తిగతంగా సంప్రదించి, బీబీఎల్‌లో ఆడే ఆసక్తి ఉందా అని అడిగారని సమాచారం. ప్రస్తుతం ఐపీఎల్‌,టీ20 (IPL, T20)లో ఆడుతున్న అశ్విన్, ఆ టోర్నమెంట్ జనవరి 4న ముగిసిన వెంటనే సిడ్నీ థండర్‌కి జాయిన్ కానున్నాడు.ఐపీఎల్ నుంచి తన రిటైర్మెంట్‌ను ప్రకటించడం వల్ల అశ్విన్ ఇప్పుడు ఇతర ఫ్రాంచైజీ టీ20 లీగ్‌లు ఆడేందుకు అర్హత సాధించాడు.

Ravichandran Ashwin

భారత క్రికెట్ బోర్డు నియమాల ప్రకారం ఐపీఎల్‌లో యాక్టివ్‌గా ఉన్న లేదా భారత జట్టులో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఇతర లీగ్‌లలో పాల్గొనలేరు. అయితే, అశ్విన్ రిటైర్మెంట్ వల్ల ఇప్పుడు ఏ దేశంలో అయినా ఆడే అవకాశం దక్కింది.ఐపీఎల్‌లో 187 వికెట్లు తీసి, ఐదో అత్యధిక వికెట్ టేకర్‌గా నిలిచిన అశ్విన్..

బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారతీయుడు ఉన్ముక్త్ చంద్

ఆస్ట్రేలియాలోని భారతీయ అభిమానులను మైదానాలకు ఆకర్షించే అవకాశం ఉంది. దీని వలన టికెట్ విక్రయాలు, టీవీ రేటింగ్స్ భారీ స్థాయిలో పెరుగుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారతీయుడు ఉన్ముక్త్ చంద్ కాగా రెండో ఇండియన్ ప్లేయర్‌గా అశ్విన్ నిలిచాడు. ఉన్ముక్త్ చంద్ 2021/22 సీజన్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ తరఫున రెండు మ్యాచ్‌లు ఆడారు. అయితే అప్పటికే ఉన్ముక్త్ అమెరికా పౌరుడిగా ఉన్నాడు. ఇప్పుడు అశ్విన్, ఆ లీగ్‌లో నేరుగా ఓ పెద్ద స్టార్‌గా అడుగుపెట్టనుండడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News fox sports report latest news lockie ferguson official announcement soon ravi ashwin big bash league shadab khan sydney thunder contract Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.