📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Asha Sharma Microsoft Gaming CEO: మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ 

Author Icon By Anusha
Updated: February 21, 2026 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Asha Sharma Microsoft Gaming CEO: ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన గేమింగ్‌ విభాగంలో కీలక మార్పులు చేపట్టింది. భారత సంతతికి చెందిన ప్రతిభావంతురాలు ఆశా శర్మను గేమింగ్‌ డివిజన్‌కు కొత్త సీఈఓగా (CEO) సంస్థ నియమించింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నాయకత్వంలో మరో భారతీయ టెకీకి అగ్రస్థానం లభించడం విశేషం.

Read Also: Trump tariffs impact : ట్రంప్ టారిఫ్ షాక్, అమెరికాకు ₹26 లక్షల కోట్లు ఆదాయం

ఫిల్‌ స్పెన్సర్‌ పదవీ విరమణ – బాధ్యతల స్వీకరణ

గేమింగ్‌ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఫిల్‌ స్పెన్సర్‌ సుదీర్ఘ కాలం పాటు మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ కు సేవలు అందించారు. తాజాగా ఆయన పదవీ విరమణ చేయడంతో, ఆ ఖాళీని ఆశా శర్మతో మైక్రోసాఫ్ట్ భర్తీ చేసింది.మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఆదాయ వృద్ధి మందగించడం, గేమింగ్ కంటెంట్ కోసం ప్రపంచ మార్కెట్‌లో తీవ్రమైన పోటీ వంటి సవాళ్లను ఆమె ఎదుర్కోనున్నారు.

asha-sharma-appointed-as-microsoft-gaming-ceo-phil-spencer-retires

పలు అంతర్జాతీయ టెక్ కంపెనీలో కీలక బాధ్యతలు

ఆశా శర్మ విద్యార్హతల విషయానికి వస్తే, ఆమె మిన్నెసోటా విశ్వవిద్యాలయం కార్ల్సన్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి బిజినెస్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ పట్టా పొందారు. కెరీర్‌ ప్రారంభంలో మైక్రోసాఫ్ట్‌ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేసిన ఆమె 2013లో సంస్థను వీడారు. అనంతరం పలు అంతర్జాతీయ టెక్‌ కంపెనీలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం మైక్రోసాఫ్ట్‌లోని కోర్‌ ఏఐ విభాగంలో సీనియర్‌ అధికారి హోదాలో తిరిగి చేరారు. ఇప్పుడు గేమింగ్‌ విభాగానికి నాయకత్వం వహించనున్న ఆశా శర్మ నియామకం సంస్థ భవిష్యత్‌ వ్యూహాలకు కీలకంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Asha Sharma Microsoft Gaming CEO latest news Microsoft Xbox News Phil Spencer Retirement Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.