అమెరికా గడ్డపై నుంచిఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భారత్‌పై అణు బెదిరింపులకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా, ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం అమెరికా వద్ద బలంగా ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు.అసదుద్దీన్ ఒవైసీ
మంగళవారం నాడు ‘ఎక్స్’ వేదికగా ఒవైసీ (Owasi) స్పందిస్తూ, “భారత్‌ను ఉద్దేశించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఉపయోగించిన భాష, ఆయన చేసిన బెదిరింపులు తీవ్రంగా ఖండించదగినవి. అమెరికా(America) గడ్డపై నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత దారుణం. దీనిపై మోదీ ప్రభుత్వం కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా రాజకీయంగా స్పందించాలి. అమెరికా ప్రభుత్వానికి గట్టిగా నిరసన తెలపాలి” అని పేర్కొన్నారు.
భారత సైన్యాన్ని మరింతగా ఆధునికీకరించుకోవాలి: ఒవైసీ
గత శనివారం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో పాకిస్థానీ ప్రవాసులతో ఏర్పాటు చేసిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో అసిమ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మేం ఒక అణుశక్తి దేశం. మేం పతనమవుతున్నామని భావిస్తే, మాతో పాటు సగం ప్రపంచాన్ని ముంచేస్తాం” అని ఆయన హెచ్చరించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
పాక్ హెచ్చరికలకు స్పందించిన భారత్
పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్థాన్ చేసే అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోయే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పింది.
అసదుద్దీన్ ఓవైసీ ఎవరు?
అసదుద్దీన్ ఓవైసీ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు AIMIM (All India Majlis-e-Ittehad-ul-Muslimeen) పార్టీ అధ్యక్షుడు. ఆయన హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు కూడా. ఆయన తన ఉజ్వలమైన ప్రసంగశైలి, మైనారిటీల హక్కుల కోసం పోరాటం చేయడంలో ప్రసిద్ధుడు
ఆయన ఏ పార్టీకి చెందినవారు?
AIMIM – అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (All India Majlis-e-Ittehad-ul-Muslimeen).
Read hindi news: hindi.vaartha.com
Read also: