📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Asaduddin Owaisi: బీజేపీ ఆరోపణలను ఖండించిన ..ఒవైసీ

Author Icon By Sushmitha
Updated: November 8, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిపక్షాలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న బీజేపీ ఆరోపణలను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) తీవ్రంగా ఖండించారు. ఒకవేళ దేశంలోకి చొరబాటుదారులు వస్తున్నారంటే, అది పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమేనని, ప్రధాని నరేంద్ర మోదీ,(Narendra Modi) సీఎం నితీశ్ కుమార్ దీనికి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ముందు కిషన్‌గంజ్‌లో ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read Also: Jaran Movie : చేతబడి నేపథ్యంలో రోమాంచితంగా సాగే ‘జారన్

Asaduddin Owaisi

బీజేపీని నిలదీసిన ఒవైసీ

“ముఖ్యమంత్రి మీవాడే, కేంద్ర హోంమంత్రి మీవాడే, ప్రధాని కూడా మీరే. మీ కళ్లెదుటే చొరబాటుదారులు ఎలా వస్తున్నారు? ఒకవేళ వారు వస్తున్నారంటే అది మీ పరిపాలనా వైఫల్యమే కదా? మీ చేతుల్లో బీఎస్ఎఫ్, సీమా సురక్షా బల్ ఉన్నాయి. అయినా చొరబాటులు జరుగుతున్నాయని మీరే ఆరోపిస్తున్నారు” అని ఒవైసీ ప్రభుత్వాన్ని నిలదీశారు.

చొరబాటుదారుల ఆరోపణను తిప్పికొడుతూ, “ఇక్కడేమైనా బంగారు గనులు దొరికాయా? లేక చమురు నిక్షేపాలు బయటపడ్డాయా? ప్రజలు గుంపులు గుంపులుగా వలస రావడానికి?” అని ప్రశ్నించారు. సీమాంచల్ ప్రాంత ముస్లింలు దేశ విభజన సమయంలో బంగ్లాదేశ్‌కు వెళ్లకుండా భారత్‌నే తమ దేశంగా ఎంచుకున్నారని, వారిని ఇప్పుడు చొరబాటుదారులు అని నిందించడం దారుణమని అన్నారు. కనీసం 10 మంది చొరబాటుదారుల పేర్లయినా బీజేపీ చెప్పగలదా అని ఆయన సవాల్ విసిరారు.

సీమాంచల్ అభివృద్ధి, రాహుల్ ఆరోపణలు

సీమాంచల్ ప్రాంత అభివృద్ధిని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఒవైసీ విమర్శించారు. “పాట్నా, దర్భంగా, భాగల్‌పూర్‌లలో ఎయిమ్స్, ఐఐటీలు కట్టామని ప్రధాని చెబుతారు. కానీ అరరియాలో ఏం చేశారో చెప్పలేరు. అందుకే ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తోంది” అని ఆయన పేర్కొన్నారు.

ఓట్ల దొంగతనం జరుగుతోందన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపణలపై మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలను చాలాసార్లు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఒవైసీ సూచించారు. “మనం పోటీ పడుతోంది బీజేపీతో. కళ్లు మూసి తెరిచేలోపు మిమ్మల్ని మాయం చేయగలరు” అని ఆయన వ్యాఖ్యానించారు. 2020 బీహార్ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలిచి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

చొరబాటుదారుల ఆరోపణలకు ఒవైసీ ఎవరిని బాధ్యులను చేశారు?

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని సీఎం నితీశ్ కుమార్‌లను ఆయన బాధ్యులను చేశారు.

సీమాంచల్ ముస్లింలపై బీజేపీ చేసిన ఆరోపణ ఏమిటి?

సీమాంచల్ ముస్లింలను చొరబాటుదారులుగా బీజేపీ నిందిస్తోందని ఒవైసీ ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

AIMIM Asaduddin Owaisi Bihar Elections BJP Google News in Telugu Infiltration Latest News in Telugu Muslims Nitish Kumar rahul gandhi Seemanchal Telugu News Today Voter List

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.