📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: 2025 Asia Cup – IND vs PAK మ్యాచ్‌ను వ్యతిరేకించిన అసదుద్దీన్ ఒవైసీ

Author Icon By Anusha
Updated: September 14, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి భారతదేశ ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేని ఘట్టంగా నిలిచింది. ఈ దాడిలో 26 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. కేవలం దేశ ప్రజలే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదుల ఈ హింసాత్మక చర్యకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, ఆపరేషన్ ఇంకా పూర్తీ కాలేదు అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.

ఇలాంటి సందర్భంలో, భారత్-పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడంపై AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “26 అమాయకుల ప్రాణాలను మర్చిపోతూ, మీకు డబ్బులే ముఖ్యమా?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఒవైసీ ప్రశ్నించిన విధంగా, పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల మతాన్ని పక్కన పెట్టి పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి భారత ప్రభుత్వం, బీసీసీఐకి (BCCI) ఏ అధికారం ఉందని ఆయన నిలదీశారు.

ఒవైసీతో పాటు అనేకమంది విపక్ష నేతలు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు

అస్సాం ముఖ్యమంత్రికి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రికి, మిగతా బీజేపీ నాయకులు అందరికీ నేనడిగేది ఒక్కటే.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పౌరుల మతం ఏంటని అడిగి మరీ చంపిన పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడకూడదని చెప్పే అధికారం మీకు లేదా?” అని ఒవైసీ ప్రశ్నించారు. ఒక క్రికెట్ మ్యాచ్‌తో బీసీసీఐకి వచ్చే రూ. 2000 కోట్లు, రూ. 3000 కోట్లు, ఉగ్రదాడిలో చనిపోయిన మన 26 మంది పౌరుల ప్రాణాల కంటే ఎక్కువ విలువైనవా? అని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ని నిలదీశారు.ఒవైసీతో పాటు అనేకమంది విపక్ష నేతలు ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు.

2025 Asia Cup

ఉగ్రవాదంతో ఎలాంటి చర్చలు ఉండవని ప్రభుత్వం చెబుతూనే.. క్రికెట్ ఆడటం దాని వైఖరికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ దత్ (Abhishek Dutt) విమర్శించారు. పహల్గాం దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశాయి. ఈ మ్యాచ్ తమ గాయాలను మరోసారి గుర్తు చేస్తుందని, తమ ప్రాణాలకు విలువ లేదని ఈ గేమ్ చూపిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి” అని బాధితుడి సోదరుడు సావన్ పర్మార్ కన్నీళ్లతో అన్నారు.

మ్యాచ్‌ను ప్రసారం చేసే క్లబ్‌లు, రెస్టారెంట్‌లను బహిష్కరించాలని

ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయిన ఐశన్య ద్వివేది.. 26 మంది అమాయకులు చనిపోయినా బీసీసీఐకి ఏమాత్రం పట్టడం లేదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబం నుంచి ఎవరూ చనిపోలేదు కాబట్టే వారికి ఆ బాధ తెలియడం లేదని వాపోయారు.ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ (AAP leader Saurabh Bharadwaj) మ్యాచ్‌ను ప్రసారం చేసే క్లబ్‌లు, రెస్టారెంట్‌లను బహిష్కరించాలని ప్రజలను కోరారు. శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది.. ప్రజలు ఈ మ్యాచ్‌ను చూడవద్దని విజ్ఞప్తి చేశారు. శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, “యుద్ధం, క్రికెట్ ఒకేసారి ఎలా సాధ్యం అవుతాయి? వారు దేశభక్తిని వ్యాపారంగా మార్చారు” అని మండిపడ్డారు.

విమర్శలపై స్పందించిన బీజేపీ నాయకులు ఈ మ్యాచ్‌ను వ్యతిరేకించడం సరికాదని అన్నారు. “కాంగ్రెస్ హయాంలో కూడా మ్యాచ్లు జరిగాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్ జరిగినప్పుడు మాత్రమే వారికి దేశభక్తి గుర్తుకొస్తుంది. మేము పాక్‌ను భూమి మీదనే కాదు, వారి గడ్డపై కూడా ఓడించాం. ఇప్పుడు విదేశీ గడ్డపై కూడా ఓడిస్తాం. మనం మైదానం నుంచి వెనక్కి తగ్గకూడదు” అని బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ రెండు అంశాలు వేర్వేరు అని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. ఆట అనేది ఒక భావోద్వేగమని, దానిని వ్యతిరేకించడం సరికాదని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-pakistan-team-doesnt-have-the-guts-to-beat-india-yograj-singh/international/547037/

26 civilians killed April 22 attack Asaduddin Owaisi Breaking News India Pakistan Tensions Jammu and Kashmir terrorism latest news Operation Sindhur Pahalgam Attack Prime Minister Narendra Modi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.