📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Arunachal Pradesh Exam: పరీక్షలో హైటెక్ మోసం..దేశవ్యాప్తంగా సంచలనం

Author Icon By Shobha Rani
Updated: May 22, 2025 • 1:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నవోదయ (Navodaya) విద్యాలయ సమితి నిర్వహించిన జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల నియామక పరీక్షలో హైటెక్ మోసం వెలుగు చూసింది. అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో నిర్వహించిన నియామక పరీక్షలో హైటెక్ కాపీయింగ్ మోసం వెలుగుచూసింది. ఇటానగర్ లో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు 2,600 కిలోమీటర్ల దూరంలోని హర్యానా నుంచి ఆన్సర్లు చెబుతున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. నవోదయ (Navodaya) విద్యాలయ సమితి నిర్వహించిన ఉద్యోగ నియామక పరీక్షలో ఈ మోసం బయటపడింది. ఇటానగర్ పరీక్ష కేంద్రంలో ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో కాపీ కొడుతూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. అనుమానంతో మిగతా అభ్యర్థులను తనిఖీ చేయగా.. 53 మంది అభ్యర్థుల చెవులలో అతిచిన్న ఎలక్ట్రానిక్ పరికరం ఉన్నట్లు గుర్తించారు. అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆ 53 మంది అభ్యర్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
హర్యానా నుంచి సమాధానాలు!
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. ఈ నెల 18న సీబీఎస్‌ఈ ఆధ్వర్యంలో నవోదయ (Navodaya) విద్యాలయ సమితిలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల కోసం అధికారులు ఇటానగర్‌లోని వీకేవీ చింపూ, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌ లలో కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం జరిగిన ల్యాబ్ అటెండెంట్ పరీక్ష సమయంలో, కింగ్‌కప్ పబ్లిక్ స్కూల్‌లో ఒక అభ్యర్థి అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జరిపిన సోదాలో సదరు అభ్యర్థి వద్ద చిన్న ఎలక్ట్రానిక్ పరికరం, అతి సూక్ష్మమైన ఇయర్‌పీస్ లభ్యమయ్యాయి.

Arunachal Pradesh Exam: పరీక్షలో హైటెక్ మోసం..దేశవ్యాప్తంగా సంచలనం

ముఠా వ్యూహం – పక్కా ప్లాన్‌తో!
దీంతో ఆ కేంద్రంలో పరీక్ష రాస్తున్న మిగతా అభ్యర్థులనూ తనిఖీ చేయగా.. 23 మంది అభ్యర్థుల వద్ద అలాంటి పరికరాలు లభ్యమయ్యాయి. వారందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివేకానంద కేంద్ర విద్యాలయ కేంద్రంలోనూ తనిఖీలు జరిపారు. రెండు కేంద్రాల్లో మొత్తం 53 మంది అభ్యర్థులను అరెస్టు చేసినట్లు, వారి నుంచి 29 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ఈ మోసం వెనుక పెద్ద ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. పరీక్షల్లో సులువుగా ఉత్తీర్ణత సాధించేలా చేస్తామని నమ్మించి, భద్రతా లోపాలు ఎక్కువగా ఉండే మారుమూల ప్రాంతాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకోవాలని ఈ ముఠా అభ్యర్థులకు సూచించినట్లు తెలుస్తోంది. అడ్మిట్ కార్డులు జారీ అయ్యాక, జీఎస్ఎం ఆధారిత పరికరాలను అందించి, వాటిని రహస్యంగా ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇచ్చారని పోలీసులు వివరించారు.
ఎలా జరిగింది ఈ చీటింగ్?
లోదుస్తులలో ఎలక్ట్రానిక్ పరికరాన్ని దాచిపెట్టి, కంటికి కనిపించని అతి చిన్న ఇయర్‌పీస్‌ను చెవిలోపల అమర్చుకుంటారు. దీని ద్వారా బయట ఉన్న వ్యక్తులతో నిరంతరాయంగా సంభాషిస్తారు. మొదట, తమకు ఏ సెట్ ప్రశ్నపత్రం వచ్చిందో అభ్యర్థులు దగ్గుల రూపంలో సంకేతాలిస్తారు. దానికి అవతలి వ్యక్తి సమాధానాలు చెబుతాడు అని మోసం జరిగిన తీరును పోలీసులు వివరించారు.ఈ మోసం కేసు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర భయం, నిరాశను కలిగించింది. హైటెక్ మోసాల కారణంగా న్యాయమైన పోటీకి భంగం కలుగుతోందన్న భావన పెరుగుతోంది. పరీక్షా వ్యవస్థ భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం అత్యవసరంగా కనిపిస్తోంది. ప్రశ్నపత్రం కూడా లీక్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దిమాపూర్, సిక్కిం, డెహ్రాడూన్‌లోని ఇతర కేంద్రాలలో కూడా చీటింగ్ జరిగినట్లు నివేదికలు అందాయని, వాటిపై కూడా దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. హర్యానాలోని జింద్ ప్రాంతం నుంచి ఈ కుంభకోణానికి సూత్రధారులు చక్రం తిప్పినట్లు అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

Read Also: Minuteman-III: మినిట్‌మ్యాన్‌-3 క్షిపణి ప్రయోగం విజయవంతం

Arunachal Pradesh Exam Breaking News in Telugu Google news Google News in Telugu High-tech fraud Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.