📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Arun Dhumal – భారత్-పాక్ మ్యాచ్‌పై అరుణ్ ధుమాల్ ఏమన్నారంటే?

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 7:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆసియా కప్ 2025 (Asia Cup 2025) క్రికెట్ టోర్నీలో భాగంగా రానున్న భారత్-పాకిస్థాన్ పోరు ప్రస్తుతం క్రీడాభిమానుల మధ్యనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ రెండు దేశాలు తలపడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌పై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ (IPL Chairman Arun Dhumal) ఓ కీలక ప్రకటన చేశారు.

భారత్ ఇప్పటికే సెప్టెంబర్ 10న యూఏఈ (UAE) జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో సాధించిన ఆ విజయంతో జట్టు టోర్నమెంట్‌ను శుభారంభం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ భారత్ ఆధిపత్యం చెలాయించడంతో అభిమానుల్లో విశ్వాసం మరింత పెరిగింది. ఈ విజయంతో జట్టు పాకిస్థాన్‌ (Pakistan) పై తలపడేందుకు పూర్తి నమ్మకంతో సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ 2025లో భాగంగా కీలక మ్యాచ్ జరగనుంది.

Arun Dhuma

సర్వత్రా ఉత్కంఠ

ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భారత జట్టు ఇప్పటికే టోర్నమెంట్‪‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. సెప్టెంబర్ 10న యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి శుభారంభం చేసింది. అయితే ఈ భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ (India-Pakistan match) ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ దీనిపై తన అభిప్రాయానని వెల్లడించారు. అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ” ఆసియా కప్ కోసం భారత జట్టుకు నా శుభాకాంక్షలు.

ద్వైపాక్షిక మ్యాచ్‌ల విషయంలో పాకిస్తాన్‌తో ఆడబోమని ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టం చేసింది. అయితే ఏసీసీ లేదా ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నప్పుడు మనం వాటిలో పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మనం ప్రభుత్వం సలహా మేరకు నడుచుకుంటాం” అని తెలిపారు. అరుణ్ ధుమాల్‌తో పాటు దేశంలోని అనేక ప్రముఖులు భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై తమ స్పందనలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/tilak-varma-my-favorite-hero-is-prabhas-tilak-varma/sports/546013/

Arun Dhumal Asia Cup 2025 Breaking News Cricket Rivalry India Cricket Team India vs Pakistan IPL Chairman latest news Operation Sindhoor Pahalgam Attack Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.