📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్

Russia: ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

Author Icon By Vanipushpa
Updated: February 6, 2026 • 5:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యాలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మాస్కో(Moscow)లో ఆ దేశ ఆర్మీకి చెందిన అత్యున్నత అధికారిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొసప్రాణాలతో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు. కాల్పులు జరిగిన విషయాన్ని రష్యా ఆర్మీ ధృవీకరింది. ఈ ఉదంతంతో ఒక్కసారిగా రష్యా ఉలిక్కిపడింది. ఆ అధికారి పేరు వ్లాదిమిర్ అలెక్సివ్. లెఫ్టినెంట్ జనరల్. కొద్దిసేపటి కిందటే ఆయన కాల్పులకు గురయ్యారు. అధికారిక నివాస భవనం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ జనరల్ స్టాఫ్ ప్రధాన డైరెక్టరేట్ డిప్యూటీ చీఫ్‌గా అలెక్సీవ్ పని చేస్తోన్నారు. 2023 జూన్‌లో కిరాయి సైన్యం అధిపతి యెవ్‌గనీ ప్రిగోజిన్ తిరుగుబాటు సమయంలో ఆయనతో చర్చలు జరిపిన కీలక అధికారులలో అలెక్సీవ్ ఒకరు.

Read Also: Islamabad Blast: మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

Russia: ఆర్మీ లెప్టినెంట్ జనరల్ పై బుల్లెట్ల వర్షం.. !

కాల్పులు, పేలుళ్లకు ఉక్రెయిన్ బాధ్యత

రష్యా ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం- మాస్కో వాయవ్య ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు అలెక్సీవ్‌ను పలుమార్లు కాల్చి పారిపోయారు. ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక అనేక మంది రష్యన్ సీనియర్ అధికారులు హత్యకు గురయ్యారు. జనరల్ స్టాఫ్ ఆర్మీ ట్రైనింగ్ డైరెక్టరేట్ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఫానిల్ సర్వరోవ్ కూడా ఇదే తరహాలో మరణించారు. డిసెంబర్ 22వ తేదీన కారు పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. దీని తర్వాత ఇప్పుడు మళ్లీ వ్లాదిమిర్ అలెక్సివ్ కాల్పులకు గురి కావడం కలకలం రేపుతోంది. ఈ ప్రాణాంతక దాడులు, కాల్పులు, పేలుళ్లకు ఉక్రెయిన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని రష్యా ఆరోపిస్తోంది. ఓటమిని అంగీకరించలేక.. ఇలా తమ దేశానికి చెందిన అత్యున్నత ఆర్మీ, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులను పొట్టనబెట్టుకుంటోందని, దొంగదెబ్బ తీస్తోందని మండిపడుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

armed forces news Army Lieutenant General Defence Updates firing incident Latest News in Telugu military officer attack National Security security breach Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.