📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత

Arjuna Ranatunga : శ్రీలంకలో సంచలనం వరల్డ్ కప్ కెప్టెన్ అరెస్టుకు రంగం సిద్ధం?…

Author Icon By Sai Kiran
Updated: December 16, 2025 • 1:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Arjuna Ranatunga : 1996 క్రికెట్ వరల్డ్‌కప్ గెలిపించిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. పెట్రోలియం మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన భారీ ఆయిల్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలని శ్రీలంక అధికారులు నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపారు.

అర్జున రణతుంగతో పాటు ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగపై కూడా కేసు నమోదైంది. ఆయిల్ సరఫరా ఒప్పందాల విధానాన్ని మార్చి, దీర్ఘకాలిక ఒప్పందాల స్థానంలో ఖరీదైన స్పాట్ కొనుగోళ్లకు వెళ్లారని అవినీతి నిరోధక సంస్థ ఆరోపించింది. 2017లో జరిగిన 27 ఆయిల్ కొనుగోళ్ల వల్ల శ్రీలంక ప్రభుత్వానికి సుమారు 800 మిలియన్ శ్రీలంక రూపాయలు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.23.5 కోట్ల నష్టం జరిగినట్లు తెలిపింది.

Read also: AP: డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

ప్రస్తుతం అర్జున రణతుంగ విదేశాల్లో ఉన్నారని, తిరిగి దేశానికి వచ్చిన వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తామని అవినీతి నిరోధక కమిషన్ కొలంబో (Arjuna Ranatunga) మేజిస్ట్రేట్‌కు వెల్లడించింది. ఇదిలా ఉండగా, అప్పటి సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్న ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగను సోమవారం అరెస్ట్ చేసి, అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. ఆయనపై విదేశీ ప్రయాణ నిషేధం విధించారు.

ఈ కేసుపై తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా ఈ కేసులు నమోదు అయ్యాయి. అర్జున రణతుంగ మరో సోదరుడు ప్రసన్న రణతుంగ కూడా గతంలో బీమా మోసాల కేసులో అరెస్ట్ కావడం గమనార్హం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also:

1996 World Cup captain Arjuna Ranatunga Breaking News in Telugu Ceylon Petroleum Corporation scam cricket corruption news Google News in Telugu Latest News in Telugu oil procurement scam Ranatunga arrest news Sri Lanka corruption case Sri Lanka latest news Sri Lanka oil scam Sri Lanka politics news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.