📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Arizona: అరిజోనాలో విమానం కూలి నలుగురు మృతి

Author Icon By Anusha
Updated: August 6, 2025 • 12:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల విమాన ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అహమ్మదాబాద్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో 242 మంది మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎక్కడో ఒకచోటు సాంకేతిక కారణాలతో విమానాలు హఠాత్తుగా ల్యాండ్ కావడం, ప్రమాదాలకు గురికావడంజరుగుతున్నది. తాజాగా అరిజోనాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మరణించారు. ఉత్తర అరిజోనాలోని (Arizona) నేషన్ సమీపంలో మంగళవారం ఒక వైద్యరవాణా విమానం కుప్పకూలింది. 12:40 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న నలుగురు వైద్యసిబ్బంది మరణించినట్లు అధికారులు తెలిపారు. న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీ నుండి బయలుదేరిన డిఎస్ఐ ఏవియేషన్ కంపెనీకి చెందిన ఈవిమానం చిన్లే మున్సిపల్ ఎయిర్పోర్ట్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

సహాయక చర్యలకు ఆటంకాలు

ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చలరేగాయని అధికారులు చెప్పారు. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగినట్లు సమాచారం. మరణించిన ముగ్గురు వైద్యసిబ్బంది, ఒక పేషెంట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ పేషెంట్ ను చికిత్స కోసం తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని వెల్లడించారు. ఈ విషయంపై నవజో నేషన్ (Navajo Nation) అధ్యక్షుడు బుయు నైగ్రెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ప్రమాదానికి కారణాలు తెలియదు

కాగా ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎ), నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డు(ఎస్టిఎసి) ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత వెల్లడి కానున్నాయి.

అరిజోనా రాష్ట్రం ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది?

అరిజోనా రాష్ట్రం ప్రపంచంలోని ఏడు ప్రకృతి అద్భుతాలలో ఒకటైన గ్రాండ్ కేన్యాన్ నేషనల్ పార్క్‌కు నిలయంగా ఉండటంతో ప్రసిద్ధి చెందింది. అదనంగా అనేక జాతీయ అడవులు, జాతీయ పార్కులు, జాతీయ స్మారక చిహ్నాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి.

అరిజోనా రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉంటుంది?

అరిజోనా రాష్ట్రం ప్రధానంగా ఎడారి వాతావరణాన్ని కలిగి ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి, శీతాకాలంలో చల్లగా ఉంటుంది. ఎడారి ప్రాంతాల పక్కన పర్వతాలు, అరణ్య ప్రాంతాల్లో వాతావరణం కొంత మితంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bangladesh-calls-india-friend-shocks-china-pakistan/international/526761/

Arizona plane crash Breaking News Chinle Municipal Airport incident DSI aviation crash four killed in Arizona crash latest news medical transport plane accident Telugu News US plane crash news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.