📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..?: చంద్రబాబు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 20, 2025 • 7:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జ్యూరిచ్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్‌ చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు వాళ్లు ఎక్కడైనా గొప్పగా పని చేస్తారు.. రాణిస్తారు. అన్ని దేశాల్లో తెలుగు వారి ప్రింట్ ఉంటుంది. అదే మన గొప్పతనం అని తెలిపారు. ఇన్ని దేశాల్లో తెలుగు వారు ఉన్నారా..? అని ఆశ్చర్యపోయానని తెలిపారు. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందన్నారు.

చదువులో ఆడపిల్లపై వివక్ష చూపించవద్దని ఆనాడే చెప్పాను. పురుషుల కంటే మహిళలే తెలివైన వారని నిరూపితమైంది. ప్రస్తుతం యువకుల కంటే యువతులే ఎక్కువగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆ రోజుల్లో ఐటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా. హైదరాబాద్ లో భూములు అమ్ముకోవద్దని చాలా మందికి చెప్పాను. హైదరాబాద్ లో భూములకు అధిక ధర వస్తుందని ఆనాడే చెప్పా. తెలంగాణ తలసరి ఆదాయం హైదరాబాద్ సంపదే కారణం అని సిఎం చంద్రబాబు తెలిపారు. మరోజన్మ ఉంటే తెలుగు వారిగా పుట్టించాలని దేవుడిని కోరుకుంటున్నానని తెలిపారు.

తాను జైలులో ఉన్నప్పుడు మీరంతా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. చాలా దేశాల్లో ఉన్న తెలుగువారు నిరసన తెలిపారని చెప్పారు. కూటమి గెలుపులో ఎన్‌ఆర్‌ఐల పాత్ర ఎంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీ ఫార్మా రంగంలో పెట్టుబడులకు సహకరించాలని.. స్విస్‌ రాయబారి మృదుల్‌ కుమార్‌ను చంద్రబాబు బృందం కోరారు. కాసేపట్లో తెలుగు కమ్యూనిటీతో చంద్రబాబు ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ నిర్వహించనున్నారు. అనంతరం జ్యూరిచ్‌ నుంచి దావోస్‌కు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.

Ap CM chandrababu davos tour World Economic Forum conference Zurich

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.